Safe Areas
-
10,696 మంది తరలింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముంపునకు గురైన 108 గ్రామాల నుంచి 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి తెలి పారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు ఉప్పొంగడంతో మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిందని, అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి 600 మందిని, మంథనిలోని గోపాల్పూర్ ఇసుక క్వారీ లో చిక్కుకున్న 19 మంది కార్మికులను సుర క్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఆర్మీ హెలికాప్టర్‌ను మోరంచపల్లికి పంపించి అక్కడ చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామన్నారు. మరో 4 హెలికాప్టర్లు, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. డీజీపీ అంజనీ కుమార్‌తో కలిసి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లోని అన్ని పీహెచ్ సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుప త్రులను 24 గంటలు తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఖమ్మం పట్టణానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, బూరు గుంపాడుకు హెలికాప్టర్‌ను వెంటనే పంపిస్తున్నామని తెలిపారు. ప్రయా ణికులు చిక్కుకున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్‌లు... వరద ప్రభావిత జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వ ం నియమించింది. ములుగుకు కృష్ణ ఆదిత్య, భూపాలపల్లికి పి.గౌతమ్, నిర్మల్‌కు ముషా రఫ్ అలీ, మంచిర్యాలకు భారతి హోలికేరి, పెద్దపల్లికి సంగీత సత్యనారాయణ, ఆసిఫా బాద్‌కు హన్మంతరావును కేటాయించింది. వరద చూసేందుకు వెళ్లి చిక్కుకుంటున్నారు వర్షాల నేపథ్యంలో ప్రజలు నీటి ప్రవాహం ఉన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీలపై ప్రయాణించ వద్దని సీఎస్ సూచించారు. చాలాచోట్ల వరద పరిస్థితులను చూసేందుకు వెళ్లినవారు అనూ హ్యంగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారని చెప్పారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్.. సహాయ, పునరావాస కార్యక్రమాల పర్య వేక్షణకు ముగ్గురు సీనియర్ అధికారులతో సచివాలయంలో 7997950008, 7997 959782, 040 – 23450779 అనే ఫోన్ నంబర్లతో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని సీఎస్ తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్లలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లా ముత్యాలధార జలపాతంలో చిక్కుకుపో యిన 80 మంది పర్యాటకులను బుధవా రం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సురక్షి తంగా బయటకు తెచ్చామని తెలిపారు. -
ప్రాణాలు దక్కితే చాలు
సాక్షి, నేషనల్ డెస్క్: అందరిలోనూ ఒకటే ఆరాటం.. ఒకటే ఆకాంక్ష. ఈ క్షణం ప్రాణాలు దక్కించుకుంటే చాలు. ఈ యుద్ధభూమి దూరంగా వెళ్లిపోయి క్షేమంగా మిగిలితే అదే పదివేలు. అందుకే వాహనాలన్నీ రోడ్లపై బారులు తీరాయి. పెట్రోల్ బంకులు, ఏటీఎం కేంద్రాలు జనం రద్దీతో కిటకిటలాడాయి. అండర్‌గ్రౌండ్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో గురువారం ఉదయమే కనిపించిన దృశ్యాలివీ.. రష్యా సైన్యం అకస్మాత్తుగా దాడులు ప్రారంభించడంతో ఉక్రెయిన్ ప్రజలు కకావికలమయ్యారు. బాంబుల మోతలు, ఎయిర్ సైరన్లు భీకర స్థాయిలో వినిపిస్తుండడంతో తొలుత ఏం జరుగుతోందో అర్థంకాక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విస్ఫోటన శబ్దాలు విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రష్యా సైన్యం విరుచుకుపడుతోందని తెలిశాక సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నారు. పిల్లా పాపలు, కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనాల్లో పయనమయ్యారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టాయి. పెట్రోల్ కోసం చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది. రోడ్లపై తరచుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరం వెలుపలకు దారితీసే రోడ్లన్నీ వ్యక్తిగత వాహనాలతో నిండిపోయాయి. కొందరైతే అండర్‌గ్రౌండ్ స్టేషన్లకు పరుగులు తీశారు. రోజంతా అక్కడే తలదాచుకున్నారు. అన్నపానీయాలు సైతం ఇచ్చేవారు లేక ఆకలితో అలమటించారు. పిల్లల రోదనలు, పెద్దల కన్నీళ్లతో అండర్‌గ్రౌండ్ స్టేషన్లలో దృశ్యాలు హృదయాలను బరువెక్కించాయి. డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు ప్రజలు పోటెత్తారు. కొద్దిసేపట్లోనే ఏటీఎం యంత్రాలు ఖాళీ కావడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చిందని, రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల కోసం దుకాణాల్లో జనం ఎగబడ్డారు. కీవ్‌లోని ఓ ఏటీఎం వద్ద నగదు కోసం బారులు తీరిన ప్రజలు విద్యాసంస్థలు మూసివేత ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, బయటకు రావొద్దని అధికారులు పదేపదే అభ్యర్థించారు. అయినప్పటికీ జనం ప్రాణభయంతో నగరం విడిచి వెళ్లేందుకే మొగ్గుచూపారు. చాలామంది మెట్రో స్టేషన్లకు చేరుకున్నారు. బంధు మిత్రులకు ఫోన్లు చేస్తూ క్షేమ సమాచారాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు వెల్లడించారు. మెట్రో రైళ్లు, బస్సులు యథావిధిగా నడిచాయని చెప్పారు. ఇక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ముందు జాగ్రత్తగా మూసివేశారు. ప్రభుత్వం మార్షల్ లా విధించడంతో ఆసుపత్రుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రష్యా దాడులతో తూర్పు సరిహద్దుకు చాలా దూరంగా ఉన్న నగరాల నుండి కూడా పొగలు వచ్చాయి. కీవ్‌లోని ప్రధాన వీధి క్రేష్చాటిక్లో ఆందోళనతో నిండిన ప్రజలు కనిపించారు. చాలా మంది పాత్రికేయులు బస చేసిన హోటల్‌ను 30 నిమిషాల్లో ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు. ఖార్కివ్‌లో పిల్లల ఆట స్థలంలో మిలటరీ శకలాలు పడ్డాయి. నగరంలో ప్రతి ఒక్కరూ వారికి అవసరమైన ఔషధాలు, గుర్తింపు పత్రాలతో సిద్ధంగా ఉండాలని కీవ్ మేయర్ సూచించారు. ‘ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. తక్షణ సాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియట్లేదు’’ అని కీవ్ నివాసి ఎలిజవేటా మెల్నిక్ వాపోయారు. ఇది నా జీవితంలో అత్యంత దారుణమైన సూర్యోదయం అని ఖార్వివ్ నగరానికి చెందిన సాశా అనే మహిళ వాపోయారు. బాంబుల శబ్దాలతోనే నిద్ర నుంచి మేల్కొన్నానని చెప్పారు. -
వర్షం పడిందంటే భయం భయంగా.. మొత్తం 290 మంది మృతి
సాక్షి, ముంబై: గడిచిన 29 ఏళ్లలో ముంబై నగరం, తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో కొండచరియలు విరిగిపడిన సుమారు 290 మందికిపైగా మృతి చెంది నట్లు తెలిసింది. మరో 300 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో కొందరి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో వికలాంగులుగా మారారు. ఏటా ఇలాంటి ప్రమాదాలు జరగ్గానే కొండలపై, వాటి కింద గుడిసెల్లో ఉంటున్న పేద కటుంబాల అంశం తెరమీదకు వస్తుంది. ఆ తరువాత షరా మామూలే అవుతుంది. ప్రమాదం జరగ్గానే ఆగమేఘాల మీద మంత్రులు, ప్రభుత్వ, బీఎంసీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించడం, మృతు లకుటుంబాలకు సానుభూతి ప్రకటించడం, ఆర్థిక సాయం ప్రకటించి చేతులు దులుపేసుకుంటున్నా రు. అవసరమైతే గుడిసెలను ఖాళీచేయాలని నోటీసులు జారీ చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం కనుగొనడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆదివారం ముంబైలో కురిసిన భారీ వర్షానికి వేర్వేరు సంఘటనలో దాదాపు 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అందులో కొండచరియలు విరిగిపడి మృతి చెందినవారి సంఖ్య అధికంగా ఉంది. 25 నియోజకవర్గాల్లో ప్రమాదకర కొండలు.. 1991 నుంచి 2021 వరకు కొండచరియలు విరిగిపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ముంబైలో మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో ఏకంగా 25 నియోజక వర్గాలలో ప్రమాదకర కొండలున్నాయి. ఇప్పటికే ఆ కొండలపై, వాటికి ఆనుకుని అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. కొండల కింద ప్రమాదకరంగా ఉన్న 22,483 గుడిసెల్లో 9,657 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి స్థలాంతరం చేయాలని ఇదివరకే ‘ముంబై జోపడ్‌పట్టి సుధార్ మండలి’ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదేవిధంగా మిగతా గడిసెలపై కొండ చరియలు విరిగిపడకుండా ఇళ్ల చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని సిఫార్సు చేసింది. కానీ, ఇంతవరకు ప్రమాదకరంగా ఉన్న కొండలు, వాటికి ఆనుకున్న ఉన్న గుడిసెలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా కొండచరియలు విరిగిపడిన సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది. ఇదిలాఉండగా కొండ పరిసర ప్రాంతా ల్లోని మురికివాడల్లో నివాసముంటున్న పేద కుటుంబాలు స్వయంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది. లేదంటే బలవంతంగా తరలించే ఏర్పాట్లు చేయాలని బీఎంసీ పరిపాలనా విభాగం సంబంధిత అధికారులకు నిర్ధేశించిన విషయం తెలిసిందే. ఏటా వర్షాకాలంలో జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడే ప్రమాదముంటుంది. కొండల కింద, కొండలపైన, చుట్టుపక్కల ఉన్న గుడిసెల్లో వేలాది కుటుంబాలున్నాయి. అందులో లక్షలాది మంది పిల్ల, పాపలతో నివాసముంటున్నారు. వర్షా కాలంలో పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టి పెళ్లలు వచ్చి ఇళ్లపై పడతాయి. దీంతో వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు పేద కుటుంబాలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తారు. భారీ వర్షం కురి సిందంటే చాలు రాత్రులు నిద్ర లేకుండా గడుపుతా రు. దీంతో ప్రమాదం జరగకముందే సురక్షిత ప్రాం తాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది. వర్షాకాలం భయం భయం.. ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల కొండలున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే అక్కడి ప్రజలు భయంభయంగా బతుకీడుస్తారు. ముంబైలో మలబార్ హిల్, వర్లీ సీ ఫేస్, అంటాప్ హిల్‌లో ప్రాంతాల్లో, ఉప నగరాల్లో ఘాట్కోపర్, విద్యావి హార్, ఎం–తూర్పు వార్డు పరి«ధిలోని దిన్క్వారి మార్గ్‌పై గౌతం నగర్, పాంజర్పోల్, వాసి నాకావద్ద ఓం గణేశ్ నగర్, రాహుల్ నగర్, నాగాబాబా నగర్, సహ్యాద్రి నగర్, అశోక్ నగర్, భారత్‌నగర్ తదితరా ప్రాంతాల్లో కొండల కింద ఉంటున్న ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీఎంసీ సూచించింది. లేదంటే బలవంతంగా తరలించాల్సి వస్తుం దని హెచ్చరించింది. అయినప్పటికీ బలవంతం గా అక్కడే ఉంటే ఆ తరువాతే జరిగే పరిణామాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి వారే బాధ్యులవుతారని హెచ్చరించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదానికి కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, బీఎంసీ ఎలాంటి బాధ్యత వహించదని పరిపాలనా విభాగం స్పష్టం చేసింది. అయినప్పటికీ వేలాది కుటుంబా లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడే కా లం వెల్లదీస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరగడం పరిపాటిగా మారింది. #MumbaiRains UPDATE 20:30-18/7/21#VikhroliLandslide & #ChemburLandslide 🔸@5Ndrf OPS END 🔸After final search 🔸@ Both sites 🔸Chembur-21 dead 2 inj 🔸Vikhroli-10 dead 🔸All missing actd for 🔸@NDRFHQ prays for 🔸Departed souls@HMOIndia @PIBHomeAffairs @ANI @PIBMumbai pic.twitter.com/UFmiWrYStu — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) July 18, 2021 Landslide at Gholai Nagar in Kalwa, Thane district. 5 dead and 2 injured, Rescue and Search Operation is underway. #mumbairains #MumbaiRainUpdate #KalwaLandslide pic.twitter.com/rTwaKHza7H — Ankita Gupta (@ankitagupta102) July 19, 2021 Another land slide video coming from vikroli west parksite near kailash complex #MumbaiRains #MumbaiRainUpdate @IndiaWeatherMan @MumbaiRainApp @Mumbairain pic.twitter.com/XsfyAEePhN — Rahul Pandey (@scriberahul) July 19, 2021 -
శాండియాగోలో కార్చిచ్చు
శాన్‌డియాగో: అమెరికాలోని శాండియాగో ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగడంతో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాంతా బార్బరా కౌంటీకి 400 కి.మీ. దూరంలో సైతం కార్చిచ్చు చెలరేగింది. అక్కడి నుంచి 1,200 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ మంగళవారం కార్చిచ్చు చెలరేగింది. అయితే, రెండు ప్రాంతాల్లోనూ చీకటిపడే వేళకు మంటలు చల్లారడంతో సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు తమ తమ ఇళ్లకు వెళ్లవచ్చని అధికారులు సూచించారు. కార్చిచ్చు వల్ల ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కి మించి ఉండటంతో మంట లను చల్లార్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కొంత ప్రయాసపడ్డారు. శాండియాగో సమీపంలోని రాంకో బెర్నార్డో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు శరవేగంగా 280 హెక్టార్ల మేరకు విస్తరించాయి.