ఘర్షణలతో అట్టుడుకుతున్న యెమెన్‌లోని ఆడెన్ నుంచి బుధవారం భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో 350 మంది భారతీయులు జబౌతి దేశానికి చేరుకున్నారు. వీరు రెండు భారత వాయుసేన విమానాల్లో బుధవారం రాత్రి పొద్దుపోయాక స్వదేశానికి చేరుకుంటారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీటర్‌లో తెలిపారు.
యెమెన్ రాజధాని సనాలో విమానాశ్రయంలో భారత్ నుంచి వెళ్లిన విమానానికి దిగేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో 320 మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. తమను త్వరగా స్వదేశానికి చేర్చేందుకు ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని సనాలో చిక్కుకుపోయిన రవికుమార్ అనే బెంగళూరు వాసి వాట్సప్ సందేశం ద్వారా కోరారు. భారతీయుల తరలింపును పర్యవేక్షించేందుకు విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం యెమెన్ పొరుగు దేశమైన జిబౌతికి చేరుకున్నారు. ఆడెన్‌లోని షియా రెబెల్స్ స్థావరాలపై సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమి బుధవారం కూడా యుద్ధవిమానాల నుంచి బాంబుల వర్షం కురిపించింది. హోదేబా నగరంలోని డెయిరీపై జరిగిన బాంబు దాడిలో నలుగురు పౌరులు, మేదీలో జరిగిన దాడిలో ఆరుగురు చనిపోయారని వైద్యులు చెప్పారు.
జిబౌతికి 350 మంది భారతీయులు
Published Thu, Apr 2 2015 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM
Advertisement