20 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు
20 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు
Published Fri, Oct 7 2016 1:44 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
వాషింగ్టన్: అత్యంత శక్తిమంతమైన మాథ్యూ హరికేన్ అమెరికాను వణికిస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ తుఫాను ఫ్లోరిడాను తాకనున్న నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. హరికేన్ విధ్వంసానికి గురయ్యే ప్రాంతంలోని సుమారు 2 మిలియన్ల ప్రజలను ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాలలో ఎమర్జెన్సీని ప్రకటించారు.
కరీబియన్ దీవుల్లోని హైతీలో మ్యాథ్యూ హరికేన్ పెను విధ్వంసం సృష్టించింది. అక్కడ 350 మంది మృతికి కారణమైన ఈ హరికేన్.. కాస్త బలహీనపడి నాలుగో కేటగిరీ నుంచి మూడో కెటగిరీకి మారి అమెరికాలోకి ప్రవేశిస్తోంది. అయినప్పటికీ ఇది పెను విధ్వంసం సృష్టించే తుఫానుగా అమెరికా వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే దీని ప్రభావంతో ఫ్లోరిడా తూర్పుతీరంలో బలమైన గాలులు వీస్తున్నట్లు స్థానికులు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీని ప్రభావంతో జార్జియా, సౌత్ కరోలినాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
Advertisement
Advertisement