mathew
-
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అమెరికా స్పందన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఉగ్రవాదులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు భారత్ వెనుకాబోదని మోదీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బుధవారం స్పందించారు. ‘ఈ విషయంలో ఇప్పటికే ఒకసారి స్పష్టత ఇచ్చాను. అమెరికా ఈ విషయంలో అస్సలు జోక్యం చేసుకోదు. కానీ భారత్, పాకిస్తాన్ దేశాలు సమరస్యంగా చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవాలి’ అని మిల్లర్ అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు భారతదేశంలో చాలా దృఢమైన ప్రభుత్వం ఉంది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వారి ఇళ్ల వద్ద హతమార్చడానికి కూడా వెనకాడబోము’ అని అన్నారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘భారత దేశంలోని శాంతికి భంగం కల్గిస్తే.. ఉగ్రవాదలు పాకిస్తాన్లో ఉన్నా అంతం చేస్తాం’ అని అన్నారు. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది.‘భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది’ అని పేర్కొంది. అంతకుముందు.. పాకిస్తాన్లో ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని బ్రిటన్‌కు చెందిన దీ గార్డియన్ పత్రిక ఓ నివేదిక విడుదల చేసింది. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని పేర్కొంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం. -
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం: అమెరికా
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కలిగిన ఉన్న దేశం భారత్ అని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. భారత్ ఎల్లప్పుడు తమకు ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మక భాగస్వామి అని తెలిపింది. భారత్-అమెరికా సంబంధాలపై యూఎస్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ అమెరికా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా మిల్లర్ చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో ప్రజాస్వామ్యం వెనకబాటు తనం, ప్రతిపక్షాలపై అణిచివేత దోరణీకి సంబంధించి అమెరికా కీలక వ్యాఖ్యలను ప్రస్తావిస్త్ను మీడియా అడిగిన ప్రశ్నకు మిల్లర్ సమాధానం చెప్పారు. ‘భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికాకు భారత్ చాలా ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మకమైన భాగస్వామి. ఇరు దేశాల బంధం సత్యమని నేను ఆశిస్తున్నా’అని మిల్లర్ పేర్కొన్నారు. ఇటీవల కూడా భారత సంబంధాలపై మిల్లర్ స్పందిస్తూ.. భారత్ తమకు(అమెరికా) చాలా ముఖ్యమైన భాగస్వామని పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్, అమెరికాల సంబంధాలు ఎప్పడూ వృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపింది. ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు వేయడానికి భారత్‌లో సరైన పరిస్థితులు ఉంటాయని ఆశిస్తున్నామని అమెరికా వ్యాఖానించిన విషయం తెలిసిందే. అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించిన సంగతి విదితమే. -
రన్నరప్ బోపన్న–ఎబ్డెన్ జోడీ
పారిస్: ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బోపన్న–ఎబ్డెన్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 2–6, 7–5, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఎనిమిది ఏస్‌లు సంధించింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌లకు 1,48,760 యూరోల (రూ. కోటీ 32 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది బోపన్న–ఎబ్డెన్ జోడీ ఏడు టోర్నీలలో ఫైనల్ చేరి రెండింటిలో టైటిల్ సాధించి, ఐదింటిలో రన్నరప్‌గా నిలిచింది. ఈనెల 12 నుంచి 19 వరకు ఇటలీలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు కూడా బోపన్న–ఎబ్డెన్ అర్హత సాధించారు. -
ఫ్లోరిడాలో మాథ్యూ దాటికి ముగ్గురు మృతి
వాషింగ్టన్: మాథ్యూ హరికేన్ అమెరికాపై ప్రభావం చూపుతోంది. గంటకు 175 కిలోమీటర్ల వేగంతో ఫ్లోరిడా తీరాన్ని తాకిన ఈ హరికేన్ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ తుఫాను దాటికి ఫ్లోరిడాలో ఇప్పటివరకూ ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. హరికేన్ కారణంగా సకాలంలో వైద్యం అందక ఇద్దరు మృతిచెందగా.. చెట్టుకూలి మీదపడటంతో మరో మహిళ మృతిచెందారని అధికారులు తెలిపారు. 5 పాయింట్ల తుఫాను సూచిలో కేటగిరి 5 తుఫానుగా కరీబియన్ దీవులపై విరుచుకుపడిన మాథ్యూ హరికేన్ క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం 2 పాయింట్ల కేటగిరిలో చేర్చిన ఈ హరికేన్ అమెరికాలో ప్రభావం చూపుతోంది. దీని దాటికి వేలాది విమానాలు నిలిచిపోయాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినాలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సుమారు 10 లక్షల ఇళ్లకు కరెంట్ కట్ చేశారు. డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్, సీ వరల్డ్ పర్యాటక కేంద్రాలను తుఫాను కారణంగా మూసేశారు. అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు మ్యాథ్యూ హరికేన్ కరీబియన్ దీవుల్లో తీవ్రనష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైతీలో సుమారు 400 మంది హరికేన్ దాటికి మృత్యువాతపడ్డారు. ఇక్కడ ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రొగ్రాం(డబ్ల్యూఎఫ్‌పీ) ఆధ్వర్యంలో సహాయకచర్యలు చేపడుతోంది. -
20 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు
వాషింగ్టన్: అత్యంత శక్తిమంతమైన మాథ్యూ హరికేన్ అమెరికాను వణికిస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ తుఫాను ఫ్లోరిడాను తాకనున్న నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. హరికేన్ విధ్వంసానికి గురయ్యే ప్రాంతంలోని సుమారు 2 మిలియన్ల ప్రజలను ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాలలో ఎమర్జెన్సీని ప్రకటించారు. కరీబియన్ దీవుల్లోని హైతీలో మ్యాథ్యూ హరికేన్ పెను విధ్వంసం సృష్టించింది. అక్కడ 350 మంది మృతికి కారణమైన ఈ హరికేన్.. కాస్త బలహీనపడి నాలుగో కేటగిరీ నుంచి మూడో కెటగిరీకి మారి అమెరికాలోకి ప్రవేశిస్తోంది. అయినప్పటికీ ఇది పెను విధ్వంసం సృష్టించే తుఫానుగా అమెరికా వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే దీని ప్రభావంతో ఫ్లోరిడా తూర్పుతీరంలో బలమైన గాలులు వీస్తున్నట్లు స్థానికులు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీని ప్రభావంతో జార్జియా, సౌత్ కరోలినాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.