తిరువనంతపురం : భారీ వర్షాలతో అతలాకుతలమైన దేవభూమి కేరళను ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ముందుకు వచ్చింది. యుఏఈ సక్సెస్ స్టోరీలో కేరళ ప్రజల భాగస్వామ్యం కీలకమైందంటూ వ్యాఖ్యానించిన ఆ దేశ నేతల మాటలు నిజం చేస్తూ.. 700 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం మీడియాకు తెలిపారు. కాగా వరద బీభత్సంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు ఈరోజు సాయంత్రం అఖిలపక్షం సమావేశం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment