సహాయక చర్యల్లో రాజీవ్ పిళ్లై
తిరవనంతపురం : కేరళ వరదల నేపథ్యంలో మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై తన వివాహాన్ని వాయిదా వేసుకొని మరి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని తన అప్‌కమింగ్ మూవీ ‘షకీలా’ కోస్టార్ అయిన రిచా చాదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ‘నా స్నేహితుడు.. కోస్టార్ రాజీవ్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. తన హోం టౌన్ నన్నూర్‌లో వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడెందుకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాడు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను బోట్స్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాడు. నా స్నేహితుడు చేసే పనిపట్ల గర్వంగా ఫీలవుతున్నాను’ అనే క్యాప్షన్‌తో అతని ఫొటోలను సైతం షేర్ చేశారు.
ఇక అతని సేవలను నెటిజన్లు రియల్ సూపర్ హీరో అంటూ కొనియాడుతున్నారు. రాజీవ్ పిళ్లై ఇంజనీరింగ్ విద్యార్థి అయిన అజితాను వివాహం చేసుకోవాల్సింది.. కానీ వరదల నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసుకున్నాడు. ఇక ఇప్పటికే సినీ హీరోలు విరాళాలు ప్రకటిస్తూ కేరళ బాధితులకు అండగా నిలవాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment