కేరళ వరద బాధితులను ప్రాణాలకు తెగించి రక్షించాడు ఓ పైలట్. మూడు సెకండ్లు ఆలస్యమైతే ఆ హెలికాప్టర్ ముక్కముక్కలయ్యేది. కానీ ఆ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి 26 మందిని రక్షించాడు. ఈ థ్రిల్లింగ్ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. చాలకుడి ప్రాంతంలోని వరదల్లో చిక్కుకున్న వారి కోసం పైలట్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. నావీకి చెందిన 42బీ హెలికాప్టర్‌ను ఇంటిపై(రూఫ్‌టాప్) చాకచక్యంగా ల్యాండ్ చేసి 26 మంది ప్రాణాలను రక్షించాడు.