
మంగళవారం పరవూర్‌లో వరద బాధితుని అంత్యక్రియల దృశ్యం
కొచ్చి: కేరళలోని సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న వరద బాధితులకు విష సర్పాలు స్వాగతం పలుకుతున్నాయి. బాత్‌రూంలు, కప్‌బోర్డులు, వాష్ బేసిన్లలో నాగుపాము, రక్తపింజరి పాములు హడలెత్తిస్తున్నాయి. గత ఐదు రోజులుగా కేరళలో పాముకాటు కేసులు భారీగా పెరిగాయి. కొచ్చి సమీపంలోని అంగమలిలోని అస్పత్రి అధికారులు మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి 20 వరకూ మొత్తం 53 కేసులు తమ వద్దకు వచ్చాయని చెప్పారు. దీంతో పాముల్ని పట్టుకునేందుకు సమీప అటవీ సిబ్బందికి లేదా వాటిని పట్టడంలో నైపుణ్యమున్న వారికి సమాచారమిస్తున్నారు.