∙నిలకడగా బాలుడి ఆరోగ్యం
కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురు కులంలో పాము కాటు మరోసారి కలకలం రేపింది. 3 నెలల క్రితం వారం వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు పాము కాటుకు గురికాగా, అందులో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎనిమి దో తర గతి చదు వుతున్న మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఓంకార్ రవి–రుచిత దంపతుల కుమా రుడు అఖిల్ (14) పాము కాటుకు గుర య్యాడు.
బుధవారం ఉదయం ఆరుగంటల సమయంలో అఖిల్ తన చేయి తిమ్మిరిగా ఉందని విధుల్లో ఉన్న నర్స్‌కు చూపించు కు న్నాడు. పరిశీలించిన నర్స్ ఏమీ కాలే దని సర్దిచెప్పింది. 9 గంటల సమయంలో అఖిల్ చేయి పూర్తిగా చతికిలపడటంతో వెంటనే ప్రిన్సిపాల్ మాధ వీలత దృష్టికి తీసు కెళ్లారు. చేతిపై పాముకాటు గాట్లు ఉండటంతో తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చారు. అఖిల్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment