కోల్‌కతా : ప్రకృతి విలయానికి విలవిల్లాడిన కేరళ వాసులను ఆదుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆపన్నహస్తం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో నేను సైతం అంటూ నాలుగేళ్ల చిన్నారి ఆకర్షణీయంగా నిలిచింది. కేరళలో ఉండే తన అక్కాచెల్లెళ్ల కోసమంటూ పిగ్గీ బ్యాంకులో దాచుకున్న 14 వేల 8 వందల రూపాయలను విరాళంగా ఇచ్చేసింది.
నా అక్కాచెల్లెళ్ల కోసమే...
కేరళ వరదల్లో తన తోటి చిన్నారుల కష్టాలను టీవీలో చూసిన అపరాజిత ఏం జరిగిందంటూ తల్లిదండ్రులను అడిగేది. ఈ క్రమంలో నీలాంటి ఎంతో మంది చిన్నారులు నీటిలో చిక్కుకుని బాధపడుతున్నారని, ఆకలితో ఏడుస్తున్నారంటూ వివరించారు ఆమె తల్లిదండ్రులు. దీంతో తన పిగ్గీ బ్యాంకులో ఉన్న డబ్బులు వాళ్లకు ఇచ్చేస్తానంటూ అపరాజిత ముందుకొచ్చింది. ఈ క్రమంలో జవదేవపూర్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బీమన్ బోస్.. కేరళ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపునకు అపరాజితను తీసుకువెళ్లగా.. ఆమె తన పిగ్గీ బ్యాంకును ఆయనకు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను పశ్చిమ బెంగాల్ సీపీఐ(ఎం) తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment