వైరల్‌ వీడియో : హ్యాట్సాప్‌ ఇండియన్‌ ఆర్మీ | Army Rescue Man With Prosthetic Limb In Kerala | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 23 2018 1:34 PM | Last Updated on Thu, Aug 23 2018 6:16 PM

Army Rescue Man With Prosthetic Limb In Kerala - Sakshi

తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమయింది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వర్షాలు కేరళను ముంచేశాయి. దాదాపు అన్ని జిల్లాలు వరద ముప్పులో కూరుకుపోయాయి. ఇప్పటి వరకూ దాదాపు 357 మంది చనిపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడుతున్నారు. ఓ బాలుడిని కాపాడం కోసం సైనికుడు తాడు సాయంతో ఒంటి చేత్తో హెలికాప్టర్‌పైకి వెళ్లడం, ఓ పైలట్‌ చాకచక్యంతో గర్భిణీని కాపాడడం లాంటి వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియో కూడా వైరల్‌గా మరింది.

వరదలో చిక్కుకున్న ఓ దివ్యాంగుడిని (ప్రోస్థెటిక్ అవయవం ధరించినవ్యక్తి) సైనికులు జాగ్రత్తగా కాపాడారు. ఓ అపార్ట్‌మెంట్‌లో చూట్టూ నీరు నిండి ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్థులో ప్రోస్థెటిక్ అవయవం ధరించిన వ్యక్తి చిక్కు పోయాడు. గమనించిన ఐదుగురు సైనికులు అతని కోసం పడవలో అక్కడి వెళ్లి నిచ్చెన సాయంతో జాగ్రత్తగా కిందికి దించి రక్షించారు. ఇదంతా వీడియో తీసి తమ అధికారిక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘ ఎక్కడ ఉన్న మేం మిమ్మల్ని రక్షిస్తాం’  అంటూ పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌అయింది. ఓపికతో దివ్యాంగుడిని కాపాడిన సైన్యానికి ప్రతి ఒక్కరు థ్యాంక్స్‌ చెబుతున్నారు.  చాలా మంది నెటిజన్లు సైనికులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హాట్సాఫ్‌ ఇండియన్‌ ఆర్మీ, సైనికుడు మన కోసం ఏమైనా చేస్తాడు, దటీజ్‌ ఇండియన్‌ ఆర్మీ, మీరే నిజమైన హీరోలు’ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement