తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా 400 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఇంకా 152 మంది ఆచూకీ దొరకలేదు. ఇక ఈ విపత్తు చోటుచేసుకున్న నాటి నుంచి దాదాపు 10 రోజుల పాటు భారత ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంది. నేటితో సహాయక చర్యలు ముగియడంతో వయనాడ్ ప్రజలు.. జవాన్లకు వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
కాగా, వయనాడ్‌లో ప్రకృతి విపత్తు జరిగిన నాటి నుంచి ఆర్మీ సహా సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మన ఆర్మీ జవాన్లు ఎంతో శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే, వరదల్లో చిక్కుకున్న వారిని సహాసోపేతంగా కాపాడారు. ఎంతో తక్కువ సమయంలో వంతెన నిర్మించి దేశ ప్రజల మన్ననలు అందుకున్నారు. వయనాడ్ ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యయప్రయాసలకు ఓడ్చి బాధితులకు బాసటగా నిలిచారు.
అయితే, నేటితో సహాయక చర్యలు ముగియడంతో జవాను తిరుగు పయనం అయ్యారు. ఈ సందర్భంగా జవాన్లకు వీడ్కోలు పలుకుతూ వయనాడ్ ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. జవాన్లు వెళ్తుండగా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎంతో సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
#WayanadLandslide
Watch | Emotional send-off to #IndianArmy personnel from people of all walks of life at #Wayanad.
Grateful for our brave heroes who risked everything during the landslide #RescueOps.
Your courage & sacrifice won't be forgotten…#WeCare🇮🇳@giridhararamane pic.twitter.com/u2csEIo5r7— PRO Defence Kochi (@DefencePROkochi) August 8, 2024
Comments
Please login to add a commentAdd a comment