recused
-
వీడియో: వయనాడ్‌లో జవాన్లకు వీడ్కోలు.. కన్నీరుపెట్టిన బాధితులు
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా 400 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఇంకా 152 మంది ఆచూకీ దొరకలేదు. ఇక ఈ విపత్తు చోటుచేసుకున్న నాటి నుంచి దాదాపు 10 రోజుల పాటు భారత ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంది. నేటితో సహాయక చర్యలు ముగియడంతో వయనాడ్ ప్రజలు.. జవాన్లకు వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.కాగా, వయనాడ్‌లో ప్రకృతి విపత్తు జరిగిన నాటి నుంచి ఆర్మీ సహా సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మన ఆర్మీ జవాన్లు ఎంతో శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే, వరదల్లో చిక్కుకున్న వారిని సహాసోపేతంగా కాపాడారు. ఎంతో తక్కువ సమయంలో వంతెన నిర్మించి దేశ ప్రజల మన్ననలు అందుకున్నారు. వయనాడ్ ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యయప్రయాసలకు ఓడ్చి బాధితులకు బాసటగా నిలిచారు.అయితే, నేటితో సహాయక చర్యలు ముగియడంతో జవాను తిరుగు పయనం అయ్యారు. ఈ సందర్భంగా జవాన్లకు వీడ్కోలు పలుకుతూ వయనాడ్ ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. జవాన్లు వెళ్తుండగా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎంతో సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. #WayanadLandslide Watch | Emotional send-off to #IndianArmy personnel from people of all walks of life at #Wayanad.Grateful for our brave heroes who risked everything during the landslide #RescueOps.Your courage & sacrifice won't be forgotten…#WeCare🇮🇳@giridhararamane pic.twitter.com/u2csEIo5r7— PRO Defence Kochi (@DefencePROkochi) August 8, 2024 -
తృటిలో తప్పిన ప్రమాదం.. వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కు..
తాంసి: పెన్‌గంగ నదిలో నాటుపడవ ద్వారా రోజూ ప్రయాణికులను ఇరువైపులా ఒడ్డుకు సురక్షితంగా చేరుస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా పెరిగిన నది ఉధృతిలో చిక్కుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తాంసి మండలం వడూర్ గ్రామానికి చెందిన రావుల దాద్దీప పెన్‌గంగలో నాటుపడవ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ప్రయాణికులను వడూర్–మహారాష్ట్ర వైపు ఉన్న నదీతీరాలకు చేరుస్తుంటాడు. అయితే శనివారం కురిసిన భారీవర్షానికి పెన్‌గంగ ప్రవాహం పెరిగింది. నదిలో ఉన్న పడవను బయటకు తీయడానికి దాద్దీప, స్నేహితులు అగు కుశల్, రేండ్ల శ్రీను ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. పడవలోనే ఉండిపోయిన ఈ ముగ్గురు ఒడ్డుకు చేరే మార్గం కానరాక భయాందోళన చెందారు. హాహాకారాలు చేయడంతో స్థానిక యువకులు గమనించి వెంటనే నదిలోకి దిగి ఈదుకుంటూ వెళ్లి కుశల్, శ్రీనును బయటకు తీసుకువచ్చారు. అయితే దాద్దీప పడవలోనే కొంతదూరం కొట్టుకుపోయి ఓ చోట చెట్ల కొమ్మలను పట్టుకున్నాడు. గంటకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపాడు. సమాచారం అందుకున్న భీంపూర్ ఎస్సై రాధిక అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. గంగపుత్రులు, స్థానిక యువకులు టైర్లు, తాళ్ల సాయంతో అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాద్దీప ప్రాణాలతో బయటపడగా పడవ మాత్రం నీటి ప్రవాహంలోనే కొట్టుకుపోయింది. ఇది కూడా చదవండి: గోదావరి ఉప నది ఉధృతి.. 20కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ -
Bilkis Bano Case: విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయటాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణ ఇవాళ (డిసెంబర్ 13న) చేపట్టాల్సి ఉండగా.. జస్టిస్ బేలా ఎం త్రివేది విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను కొత్త బెంచ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ముందుకు మంగళవారం బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదల పిటిషన్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది విచారించాలనుకోవట్లేదని తెలిపారు మరో జడ్జీ జస్టిస్ అజయ్ రాస్తోగి. ‘ఈ ధర్మాసనం ముందుకు పిటిషన్ వచ్చినా.. అందులో ఒకరు తప్పుకున్నారు.’అని జస్టిస్ రాస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే, జస్టిస్ త్రివేది ఎందుకు తప్పుకున్నారనే విషయంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె కుటుంబ సభ్యులతో సహా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని.. జీవిత ఖైదుగా మార్చాయి. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ పాలసీ ప్రకారం.. ఆ పదకొండు మందిని విడుదల చేసింది. ఆగస్టు 15న 11 మంది దోషులను విడుదల చేయటాన్ని రెండు వేరువేరు పిటిషన్ల ద్వారా సవాల్ చేశారు బిల్కిస్ బానో. సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇదీ చదవండి: 11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో.. సుప్రీంలో పిటిషన్ -
తాగిన మత్తులో కొండ చిలువతోనే ఆటలు
-
తాగిన మత్తులో కొండ చిలువతోనే ఆటలు.. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది!
తాగిన మైకంలో కొందరు వ్యక్తులు చేసే పనులు చూస్తే షాక్ అవుతుంటాము. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన పని.. ప్రాణాలకు మీదకు తెచ్చింది. బతుకు జీవుడా అన్నట్టుగా గాయాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని కితాసోటి ఖుర్ద్ గ్రామానికి చెందిన బిర్జాలాల్ రామ్ భూయాన్ అనే వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించి ఆ ప్రాంతంలో ఉన్న డ్యామ్ వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఓ భారీ కొండ చిలువ కనిపించడంతో సరదాగా దాన్ని పట్టుకుని మెడలో వేసుకున్నాడు. అనంతరం.. కొండ చిలువ అతని మెడకు చుట్టుకుంది. దీంతో, అతడు ఎంత ప్రయత్నించినా పాము రాకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న రామ్ భూయాన్ కొడుకు, అతడి స్నేహితులు కలిసి పామును విడిపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రామ్ భూయాన్.. నీటిలో పడిపోయాడు. ఇద్దరు యువకులు.. కొండ చిలువను విడిపించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో, బాధితులు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
-
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు: మరో ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కేసు విచారణ నుంచి ఇద్దరు జడ్జీలు తప్పుకోగా.. తాజాగా రమణ కూడా వీరి జాబితాలో చేరారు. ఈ విషయం గురించి రమణ మాట్లాడుతూ.. ‘నాగేశ్వర రావుది, నాది ఒకే రాష్ట్రం. అంతేకాక నేను, అతని కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యాను. ఈ నేపథ్యంలో నేను ఈ విచారణ బెంచ్‌లో ఉండటం సబబు కాదు. అందుకే తప్పుకుంటున్నాను’ అని తెలిపారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తొలుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున.. ఈ కేసు తదుపరి విచారణకు తాను దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే జస్టిస్ సిక్రీ కూడా ఈ కేసు విచారణ బెంచ్ నుంచి తప్పుకుటున్నట్లు ప్రకటించారు. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తొలిగించిన ఉన్నతాధికార కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. దాంతో తాను ఈ బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సిక్రీ తెలిపారు. తాజాగా ముడో వ్యక్తి ఎన్వీ రమణ కూడా ఈ బెంచ్ నుంచి తప్పుకున్నారు. పిటిషన్‌ను విచారించే ధర్మాసనం నుంచి ఒక్కొక్కరు తప్పుకోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు విచారణకు గొగోయ్ దూరం
-
ఆ కేసు విచారణకు గొగోయ్ దూరం
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున ఈనెల 24 నుంచి జరిగే ఈ కేసు విచారణకు దూరంగా ఉన్నానని, మరో బెంచ్ ఈ పిటిషన్‌ను విచారిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ చీఫ్‌కు పేర్ల కుదింపు, ఎంపిక, నియామకంలో పారదర్శకత ఉండాలని పిలుపు ఇచ్చారు. కాగా 1986 ఒడిషా కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎం నాగేశ్వరరావును గత ఏడాది అక్టోబర్ 23న సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్దానాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వారిని ప్రభుత్వం సెలవుపై పంపింది. తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు వెనువెంటనే ఆస్ధానా అవినీతి కేసును విచారిస్తున్న డీఎస్పీ ఎకే బస్పీ, డీఐజీ ఎంకే సిన్హా,జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ సహా పెద్దసంఖ్యలో అధికారులను బదిలీ చేయడం వివాదాస్పదమైంది. మరోవైపు వర్మ, ఆస్ధానాల వ్యవహారం న్యాయస్ధానానికి చేరిన క్రమంలో నాగేశ్వరరావును ప్రభుత్వం అడిషనల్ డైరెక్టర్ స్ధాయికి ప్రమోట్ చేసింది. -
నా భార్య గురించి మీకెందుకు?
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై జరిగిన 26/11 దాడి కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ హెడ్లీ విచారణ బుధవారం ప్రారంభమైంది. ఈ విచారణలో తన వ్యక్తిగత అంశాల విచారణపై అభ్యంతరం వ్యక్తంచేసిన హెడ్లీ కొన్ని సంచలన విషయాలను వెల్లడించాడు. 2002 తరువాత దుబాయ్, పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టానని, అక్కడ తనకు కొన్ని షాపులు కూడా ఉన్నట్లు విచారణలోఅంగీకరించాడు. డ్రగ్స్, అక్రమ ఆయుధ వ్యాపారాన్ని నిర్వహించానని కూడా డేవిడ్ హెడ్లీ ఒప్పుకున్నాడు. అమెరికాలో ఉన్న హెడ్లీని వీడియో లింక్ ద్వారా విచారిస్తున్నారు. తన భార్య షాజియా గిలానీ గురించిన సమాచారాన్ని వెల్లడించేందుకు మాత్రం హెడ్లీ నిరాకరించాడు. తన గురించి అడగాలని, అంతేతప్ప తన భార్య గురించి మీకెందుకని విచారణ అధికారులను ఎదురు ప్రశ్నించాడు. తనకు లష్కరే తాయిబాతో సంబంధాలు ఉన్న విషయం తన భార్యకు తెలుసన్నాడు. పాకిస్తాన్‌కు చెందిన జెబ్ షా అనే వ్యక్తి అక్కడి డ్రగ్ వ్యాపారానికి సహకరించాడని విచారణలో హెడ్లీ తెలిపాడు. భారత్ లోకి ఆయుధ అక్రమ రవాణాలో ఆసక్తి చూపిన అతనితో కలిసి 2006లో అక్రమ వ్యాపారానికి తెరతీసినట్టు తెలిపారు. 1992 నుంచి మత్తు మందుల వ్యాపారంలో ఉన్నాననీ, 1988 జైలునుంచి విడుదలైనప్పటినుంచీ, తిరిగి 1998 మళ్లీ జైలుకెళ్లేదాకా ఈ వ్యాపారాన్ని కొనసాగించినట్టు హెడ్లీ తెలిపాడు. లష్కర్ తాయిబా నుంచి తనకు నిధులు అందలేదని, తానే వారికి నిధులు సమకూర్చానని విచారణలో వెల్లడించాడు. పాకిస్తాన్ లాహోర్ లో ఉన్నప్పుడు పంజాబీ నేర్చుకున్నానన్నాడు. మరో లష్కరే ఉగ్రవాది తహావుర్ రాణాతో తనకు పరిచయం ఉన్నట్లు హెడ్లీ అంగీకరించాడు. అయితే లష్కర్ తో మాత్రం రాణాకు సంబంధాలు లేవన్నాడు. 26/11 కుట్ర సందర్భంగా ఆయన కార్యాలయాన్ని వాడుకున్నామని తెలిసిన తరువాత రాణా తనను కార్యాలయం నుంచి తొలగించినట్టు చెప్పాడు. ముంబై దాడుల కోసం ప్రణాళిక వేయడంలో హెడ్లీకి రాణా సహకరించాడన్న ఆరోపణలున్నాయి. పాక్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గత విచారణలో హెడ్లీ అంగీకరించిన విషయం తెలిసిందే. అబూ జుందాల్ లాయర్ అబ్దుల్ వహాబ్ ఖాన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ సమక్షంలో హెడ్లీ విచారణ సాగింది. ముంబై క్రైం బ్రాంచ్ చీఫ్ అతుల్ కులకర్ణి కూడా పాల్గొన్న ఈ విచారణ మధ్యాహ్నం వరకు కొనసాగింది.