
సన్నీలియోన్
ముంబై: బాలీవుడ్ నటి సన్నీలియోన్ కేరళ వరద బాధితుల కోసం రూ.5 కోట్లు సాయం చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అయితే అదంతా అసత్య ప్రచారం అని కూడా స్పష్టం అయింది. అయితే సన్నీ మాత్రం కేరళ వరద బాధితులకు కావాల్సింది ఇస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. భర్త డానియెల్ వెబర్, మరికొంత మంది బాలివుడ్ స్నేహితుల సాయంతో 1200 కేజీల రైస్, పప్పును పంపించింది.
‘ఈ రోజు నేను, డేనియల్ కలిసి కేరళలోని కొంత మందికి ఆహారం అందించగలుగుతున్నాం. 1200 కిలోల బియ్యం, పప్పు(1.3 టున్నులు) అందించాం. ప్రస్తుత పరిస్థితుల్లో వారికేం కావాలో నాకు తెలుసు. ఇంకా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. జుహులో అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసి విరాళాలు సేకరించిన ప్రతీక్, సిద్ధార్థ్ కపూర్, సువేద్ లోహియా చాలా గొప్పవారు’ అని సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (చదవండి: కేరళ వరదలు: రోనాల్డో 72.. కోహ్లి 82 కోట్లట!)
Comments
Please login to add a commentAdd a comment