
న్యూఢిల్లీ: కేరళలో గొడ్డుమాంసం (బీఫ్) తిన్న వరదబాధతులకు సాయం చేయొద్దంటూ ఆలిండియా హిందూ మహాసభ నేత స్వామి చక్రపాణి మహారాజ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బీఫ్ తినమని అఫిడవిట్ ఇచ్చిన వారికే సాయం చేయాలని పేర్కొన్నారు. హిందూధర్మం ప్రకారం గోమాతను చంపడం మహాపాపమన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ స్వామి చక్రపాణి మహారాజ్‌ను ఆలిండియా అఖాడా పరిషత్ ‘ఫేక్ బాబా’ల జాబితాలో చేర్చింది. ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం కారును స్వామి చక్రపాణి వేలంలో కొని తగులబెట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment