సాక్షి, అమరావతి: వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగస్టు నెల వేతనంతో పాటు అలవెన్సులను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు.
కేరళ రాష్ట్ర సీఎం సహాయ నిధి కోసం ఆ మొత్తం అందేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ డ్రాఫ్ట్ (డి.డి) తీసి దానిని వైఎస్సార్‌సీపీ శాసనసభ కార్యాలయం ఇన్‌చార్జి ఎస్.శివప్రసాద్‌కు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
Published Mon, Aug 27 2018 7:39 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment