తిరువనంతపురం : వరదలతో తల్లడిల్లిన కేరళలో సోమవారం రాత్రి సహాయ పునరావాస శిబిరంలో కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ నిద్రించిన వ్యవహారం ప్రహసనంలా మారింది. ట్విటర్‌లో ఆయన పోస్ట్ చేసిన పరుపుపై నిద్రిస్తున్న ఫోటోకు ప్రశంసలు రాకపోగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆల్ఫోన్స్ ఈ ఫోటోను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సహా పలువురిని ట్యాగ్ చేయగా ఈ పోస్ట్‌పై నెటిజన్ల స్పందన ఆయనకు షాక్ ఇస్తోంది. సార్..ఇది పబ్లిసిటీ చేసుకునేందుకు సరైన అవకాశం కాదని ఓ ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించగా, సార్ ఇది జోక్ కాదు..ఇలాంటి ప్రదర్శనలకు ఇది సమయం కాదని మరో యూజర్ కామెంట్ చేశారు.
కేంద్ర మంత్రిగా కేరళకు ఇతోధిక సాయం చేయాల్సిన మీరు ఇలాంటి చవకబారు ప్రచార ఎత్తుగడకు పాల్పడటం సరైంది కాదని మరొకరు ట్రోల్ చేశారు. సహాయ శిబిరంలో మీరు నిద్రించినా రేపటిపై బెంగతో చాలా మంది నిద్రకు నోచుకోలేదనే విమర్శలు ఆల్ఫోన్స్‌పై వెల్లువెత్తాయి. మరోవైపు వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ ప్రస్తుతం సహాయ, పునరావాస చర్యలు ముమ్మరం చేయడంపై దృష్టిసారించింది.
Comments
Please login to add a commentAdd a comment