
తిరువనంతపురం: వరద ప్రకోపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళలో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆగస్టు 29 నుంచి ఆదివారం వరకు ఏడుగురు ఈ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ర్యాట్ ఫీవర్‌తో ఆదివారం ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ర్యాట్ ఫీవర్‌తో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఎక్కువగా కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జ్వరం కేసులు కూడా పెరిగిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. వరదబాధితులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అన్ని హెల్త్ సెంటర్లు, ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైనన్ని మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పునర్నిర్మాణ పనుల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment