శ్రీమతి అండ్‌ శ్రీవారిగా! | deepika padukone, ranveer sing in kabir khan biopic | Sakshi
Sakshi News home page

శ్రీమతి అండ్‌ శ్రీవారిగా!

Published Tue, Jan 8 2019 12:35 AM | Last Updated on Tue, Jan 8 2019 12:35 AM

deepika padukone, ranveer sing in kabir khan biopic - Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకోన్‌

బాలీవుడ్‌ నటి దీపికా పదుకోన్‌కి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా 2018 ది బెస్ట్‌ ఇయర్‌ అనొచ్చు. గతేడాది ‘పద్మావత్‌’తో సూపర్‌ హిట్‌ అందుకుని, కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడి కొత్త ఏడాదిని హ్యాపీగా ఆరంభించారు. అంతేకాదు గతేడాది ఫోర్బ్‌ మేగజీన్‌లో అత్యధికంగా సంపాదించే హీరోయిన్‌గా టాప్‌ 5లోను, ఐయండీబీ మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌గా టాప్‌ చైర్‌లోను కూర్చున్నారు. 2019 కూడా బెస్ట్‌గా ఉండాలనుకుం టున్నారామె. ఈ ఏడాది నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నారు. జనవరి 5న దీపిక బర్త్‌డే. ఈ సందర్భంగా తన పేరు మీద ‘డబ్ల్యూడబ్ల్యూదీపికాపదుకోన్‌డాట్‌కామ్‌’  అనే వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేశారు. ప్రస్తుతం యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ జీవితం ఆధారంగా ‘చప్పక్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు దీపిక.

రణ్‌వీర్‌ సంకల్పం బలమైనది
‘రామ్‌లీల, భాజీరావ్‌ మస్తానీ’ సినిమాల్లో రణ్‌వీర్‌ సింగ్, దీపికాల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి జంటగా స్క్రీన్‌ పంచుకోవాలనుందంటున్నారు ఆమె భర్త రణ్‌వీర్‌. ‘‘దీపికాతో కలసి యాక్ట్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. నటిగా తన సామర్థ్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగించలేదనుకుంటున్నాను. దీపిక ఎమోషనల్‌గా ఇంకా బాగా నటించగలదు. మేమిద్దరం మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తామో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారాయన. రణ్‌వీర్‌ అలా సంకల్పించుకున్నారో లేదో దర్శకుడు కబీర్‌ ఖాన్‌ తథాస్తు  అన్నారని బాలీవుడ్‌ మీడియా టాక్‌.

ప్రస్తుతం1983 క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఆధారంగా కబీర్‌ ఖాన్‌ ‘83’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్‌ దేవ్‌ పాత్రను  రణ్‌వీర్‌ సింగ్‌ పోషించనున్నారు. కపిల్‌ భార్య రోమీ భాటియా పాత్ర కోసం దీపికను సంప్రదించినట్టు సమాచారం. ఇండియా ఓడిపోతుందని భావించి రోమీ భాటియా స్టేడియంను విడిచి బయటకు వెళ్లిపోవడం, మళ్లీ తిరిగొచ్చే సమయానికి ఇండియా గెలిచే స్టేజ్‌లో ఉండటం వంటి సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్‌గా ఉండబోతాయట. చిన్న పాత్ర అయినప్పటికీ ఎమోషనల్‌గా ఉంటుంది కాబట్టి దీపిక అయితే బావుంటుందని టీమ్‌ భావించిందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement