జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ జోరు పెంచారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరుసగా సినిమాలు తీసేందుకు తన షెడ్యూల్స్ ఉంటున్నాయి. అక్టోబర్ 10న వేట్టైయాన్ విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
వెట్టైయాన్‌తో పాటు 'కూలీ' చిత్రాన్ని కూడా ఆయన పట్టాలెక్కించారు.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ కూడా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' ప్రాజెక్ట్‌లో రజనీ ఎంట్రీ ఇస్తారు.
ఈ సినిమాల తర్వాత కొత్తగా మరో ప్రాజెక్ట్‌కు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతేడాదిలో '2018' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్‌తో రజనీ సినిమా ఓకే అయిందని తెలుస్తోంది. తమిళంలో వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై జూడ్ ఆంథనీ జోసెఫ్ ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నటించమని మొదట శింబును సంప్రదించారట. అయితే, ఈ కథకు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రమే సెట్ అవుతారని మేకర్స్ అభిప్రాయానికి వచ్చారట. దీంతో ఇప్పటికే సినిమా కథను కూడా రజనీకి వినిపించారట. అయితే, త్వరలో చిత్ర యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment