మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కమిటీ రిపోర్ట్‌పై రజనీకాంత్ చేసిన కామెంట్ విమర్శలకు దారితీస్తుంది. మలయాళ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారని హేమ కమిటీ రిపోర్ట్‌లో తేలింది. దీంతో చాలామంది బాధితులు తమ బాధను తెలిపేందుకు ముందుకొచ్చారు. నిందితులపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే, తాజాగా కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ రియాక్ట్ అయ్యారు
తాజాగా రజనీకాంత్ మీడియాకు కనిపించడంతో జస్టిస్ హేమా కమిటీపై స్పందించమని వారు కోరారు. ఈ విషయం గురించి తనకు ఎంత మాత్రమూ తెలియదంటూనే సారీ..! అని బదులిచ్చారు. రజనీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం గురించి రజనీ స్పందించకపోవడం ఏంటి..? అంటూ అభిమానులు కూడా మండిపడుతున్నారు. రజనీ లాంటి స్టార్ హీరోలే ఇలాంటి అంశంపై రియాక్ట్ కాకుంటే ఎలా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రజనీ.. మీరు గజినీలా మారకండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
తన తదుపరి చిత్రం 'వేట్టైయాన్' అక్టోబర్ 10న విడుదల కానుందని రజనీ తెలిపారు. ఆపై థాంక్యూ 'సూర్య' అంటూ 'కంగువా' సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరారు. వాస్తవంగా కంగువా కూడా అక్టోబర్ 10న విడుదల కావాల్సి ఉంది. అయితే, రజనీతో పోటీకి దిగడం లేదని సూర్య ప్రకటించడంతో కంగువా దాదాపు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు రజనీ కంగువా గురించి ప్రస్తావించారని సమాచారం.
’ஹேமா கமிட்டி அறிக்கை பற்றி எனக்கு எதுவும் தெரியாது’ - நடிகர் ரஜினிகாந்த் பேட்டி..!#Chennai | #Rajinikanth | #Kerala | #HemaCommitteeReport | #ActorRajinikanth | #PolimerNews pic.twitter.com/S5i0tcODPu
— Polimer News (@polimernews) September 1, 2024
Comments
Please login to add a commentAdd a comment