2018 Telugu Movie Box Office Collection Day 2, Deets Inside - Sakshi
Sakshi News home page

దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే..

Published Sun, May 28 2023 4:31 PM | Last Updated on Sun, May 28 2023 5:00 PM

2018 Telugu Movie Box Office Collection Day 2 Details - Sakshi

కంటెంట్‌ నచ్చితే డబ్బింగ్‌ సినిమానా, రీమేక్‌ చిత్రమా అని చూడకుండా థియేటర్స్‌కి బారులు తీస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్‌లో ఇతర భాష చిత్రాలు ఎక్కువగా డబ్‌ అవుతుంటాయి. తాజాగా తెలుగులో విడుదలైన మలయాళ సూపర్‌ హిట్‌ ‘2018’ చిత్రానికి కూడా టాలీవుడ్‌ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకి  అనూహ్య స్పందన లభిస్తుంది. రోజు రోజుకు కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి.  మొదటిరోజు 1 కోట్లు వసూలు చేసింది.

(చదవండి: 2018 మూవీ రివ్యూ)

కేవలం మౌత్ టాక్ ఈ సినిమా రెండో రోజు 1.7 గ్రాస్ ను సాధించింది. మొదటి రోజు కంటే రెండవరోజు కలక్షన్స్ పెరగడం అతి తక్కువ సినిమాలకు జరుగుతుంది. 2018 సినిమాకి అమాంతం 70 కలక్షన్స్ పెరగడం శుభసూచకం. తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాను ఆదరిస్తారు అని నమ్మిన  ప్రముఖ నిర్మాత  బన్నీవాసు నమ్మకం మరోసారి రుజువైంది. ఈ  రెండు రోజులు గాను ఈ సినిమా మొత్తం కలక్షన్స్ 2.7 కోట్ల గ్రాస్ పైగా ఉంది. 

2018 కేరళలో  ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement