Two Hijra Group Fight At Miryalaguda Police Station, Video Viral - Sakshi
Sakshi News home page

చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్‌లో హిజ్రాల రణరంగం

Jul 11 2023 2:24 PM | Updated on Jul 11 2023 3:28 PM

Two Hijra Group Fight At Miryalaguda Police Station Video Viral - Sakshi

సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు.  ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది.

పోలీస్ స్టేషన్‌లోనే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పీఎస్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాజ్రాలు తన్నుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.


చదవండి: కేసీఆర్‌ సారు సల్లంగుండాలె బిడ్డా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement