miryalaguda police
-
పోలీస్ స్టేషన్లోనే తన్నుకున్న హిజ్రాలు
-
చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్‌లో హిజ్రాల రణరంగం
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్ స్టేషన్లోనే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాజ్రాలు తన్నుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చదవండి: కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా.. -
అవినీతి పోలీస్.. పనిచేసిన ప్రతిచోటా అక్రమాలే
‘కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ పోలీస్‌స్టోరీ సినిమాలో హీరో సాయికుమార్ పోలీస్ శాఖ పనితీరు గురించి ఎంతో గొప్పగా చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ, ఎనిమిదేళ్ల సర్వీసులోనే ఎన్నో అక్రమాలకు పాల్పడి ఆ శాఖ పరువును బాజారకీడ్చి, తాజాగా సస్పెన్షన్‌కు గురైన ఎస్ఐ రామాంజనేయులు పనితీరును గమనిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. కోదాడ/ చిలుకూరు/ మిర్యాలగూడ అర్బన్/ చింతపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన ఎం.రామాంజనేయులు 2013లో డిండి పోలీస్‌స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్ఐగా పనిచేశారు. తదనంతరం 2014లో కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు పోలీస్‌స్టేషన్ ఎస్ఐగా నియమింపబడ్డారు. తొలిపోస్టింగ్‌లోనే వివాదాస్పదుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆ స్టేషన్లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌తో సఖ్యతగా మెలుగుతున్నాడని ఫిర్యాదులు అందడంతో 2015లో ఉన్నతాధికారులు ఆయనను వీఆర్‌కు అటాచ్ చేశా రు. అయితే, ఆరు నెలలు తిరక్కముందే మోతె పోలీస్‌స్టేషన్ ఎస్ఐగా పోస్టింగ్ తెచ్చుకుని కొన్ని నెలలు పనిచేశారు. వివాదాలకు కేంద్ర బిందువుగా.. 2016 సెప్టెంబర్ నుంచి 2018 ఆగస్ట్ వరకు మిర్యాలగూడ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన కాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారని విమర్శలు వచ్చాయి. అప్పట్లో పని చేసిన సీఐని కాదని అనేక సెటిల్మెంట్లలో తలదూర్చి తనదైన శైలిలో వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలోని రాజీవ్‌చౌక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఓ ద్విచక్రవాహనదారుడిని అకారణంగా చితకబాది చివరకు క్షమాపణ చేప్పే స్థాయికి తెచ్చుకున్నాడని తెలుస్తోంది. అదే విధంగా పలు కేసుల్లో పట్టుబడిన ద్విచక్రవాహనాలను గుట్టు చప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అసలు బైక్ యజమాని ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన జిల్లా పోలీస్ శాఖ అధికారులు ఆ సమయంలో ఎస్ఐ రామాంజనేయులును ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అనంతగిరిలో అంతులేకుండా.. 2018 నుంచి 2020 వరకు రామాంజనేయులు అనంతగిరి ఎస్ఐగా పని చేస్తున్న సమయంలో అంతులేకుండా అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అధికారపార్టీ నాయకులతో అంటకాగి విపక్షాలకు చెందిన నాయకులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాడనే విమర్శలు వచ్చినా ఆయన మాత్రం తన వైఖరి మార్చుకోలేదని తెలుస్తోంది. ఉదయం సాయంత్రం ఆయన అధికార పార్టీ నేతల వద్ద హాజరు వేయించుకున్న తరువాతే డ్యూటీకి వెళ్లేవారని గుసగుసలు వినిపించేవి. ఎస్ఐ అక్రమాలపై కోదాడ రూరల్ సీఐగా పనిచేసిన శివరామిరెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తనకున్న పలుకుబడితో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. పీడీఎస్ బియ్యం రవాణా చేస్తూ దొరికిన ట్రాక్టర్‌ను కేసు నుంచి తప్పించడానికి రైతు నుంచి రూ.2లక్షలు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. గుట్కాలు అమ్ముతున్నారని వెంకట్రాంపురంలో ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని చర్చ జరిగింది. ఇక్కడ పాలేరు నుంచి ఇసుక రవాణా చేసే వారి నుంచి నెలవారీ మాముళ్లను వసూలు చేసేవాడని, సీసీ కెమెరాల ఏర్పాటులో కూడా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడని, ఓ మహిళతో పోలీసులకు పట్టుబడిన బంగారం వ్యాపారి కొడుకు విషయంలో, మరో అధికార పార్టీ కౌన్సిలర్ నుంచి కూడా ఆయన రూ.లక్షల్లో వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ పత్రాలతో బీమా క్లెయిమ్ చేయించి.. మోతెలో పనిచేస్తున్న సమయంలో అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో నార్కట్‌పల్లి కామినేని నుంచి జారీ చేసిన బిల్లులతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీంతో వారు లక్షల రూపాయల బీమా క్లెయిమ్ చేశారు. దీనిపై అనుమానం వచ్చిన బీమా సంస్థ అప్పటి సూర్యాపేట ఎస్పీ భాస్కరన్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి బోగస్ బిల్లులుగా తేల్చారు. ఈ బిల్లులతో బీమా క్లెయిమ్ చేయడంలో ఎస్ఐ పాత్ర ఉందని తేలడంతో 2020 నవంబర్ 4న ఆయనను ఎస్పీ సస్పెండ్ చేసి సూర్యాపేట జిల్లా నుంచి నల్లగొండ ఎస్పీకి అటాచ్ చేశారు. 90రోజులు.. ఎన్నో వివాదాలు సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఎస్ఐ రామాంజనేయులు కొద్ది రోజులు దేవరకొండలో పనిచేశారు. అనంతరం గత జనవరి 22న చింతపల్లి ఎస్ఐగా విధుల్లో చేరారు. పది రోజుల వ్యవధిలోనే మండల పరిధిలోని మోద్గులమల్లపల్లి సర్పంచ్ భర్త మర్ల వెంకటయ్యపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం వింజమూరు గ్రామానికి చెందిన ఓ మహిళపై చెయ్యిచేసుకోవడం, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోకపోవడం,ఇసుక దిబ్బ కూలి బాలుడు మృతిచెందినా కేసు నమో దు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. మాల్ వెంకటేశ్వరనగర్ పెట్రోల్ బంక్ వద్ద తల్లిదండ్రులతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఎనిమిదేళ్ల వయసున్న బాలిక మృతిచెందిన కేసు విచారణను పక్కదోవ పట్టించారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగడం గమనార్హం. తాజాగా చింతపల్లి మండలం కుర్మేడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద తనపై ఉన్న కేసులను తొలగిస్తానంటూ రూ.8లక్షలను తీసుకోవడంతో పూర్తి స్థాయి విచారణ చేసిన అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. చింతపల్లి పోలీస్ స్టేషన్లో 90 రోజుల పాటు విధులు నిర్వహించిన రామాంజనేయులు ఎన్నో వివాదాల్లో తలదూర్చినట్లు విమర్శలు ఉన్నాయి. -
అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్ : పరువు హత్య కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని కూతురుని బెరించారనే అభియోగం మేరకు అమృత తండ్రి తిరునగరు మారుతీరావుతో పాటు మరో ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది తన కూతురు అమృతను వివాహం చేసుకున్నాడనే కక్షతో మారుతీరావు కిరాయి వ్యక్తులతో పెరుమాళ్ల ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడని అభియోగాలు ఉన్నాయి. ఆ కేసులో మారుతీరావుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్‌పై బయటికి వచ్చారు. అయితే ఈ నెల 11వ తేదీన కందుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అమృత ఇంటికి వెళ్లి తనను మారుతీరావు పంపించాడని తెలిపాడు. ప్రణయ్ హత్య కేసులో సహకరించి మీ తండ్రి వద్దకు వస్తే ఆస్తిని మొత్తం నీ పేరుపై రాసి ఇస్తాడని చెప్పాడు. దీంతో అమృత వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం అందించింది. దీంతో స్పందించిన వన్‌టౌన్ పోలీసులు కందుల వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో మారుతీరావు, ఎంఎ కరీం లు తనను పంపారని అంగీకరించడంతో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. అమృత ఫిర్యాదు మేరకు ఈ ముగ్గరు వ్యక్తులపై బెదిరింపులు, సాక్షిని ప్రలోభపెట్టడం వంటి కేసులను నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు. చదవండి: అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి.. వ్యక్తి ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమా? ‘చనిపోయే వరకు అమృత ప్రణయ్లానే ఉంటాను’ ప్రణయ్ కేసులో నిందితులకు బెయిల్ వారి వల్లే ఇంకా బ్రతికున్నాం: ప్రణయ్ తండ్రి ‘ప్రణయ్ మళ్లీ పుట్టాడు’ అతడు మా ఇంటికి ఎందుకు వస్తున్నాడు: అమృత ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు! -
పోలీస్‌శాఖలో కలకలం..వీడియో వైరల్ !
-
సీఐ అవినీతిపై కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ టూటౌన్ సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్ అవినీతిపై అదే స్టేషన్ కానిస్టేబు ల్ రాజుకుమార్ తీసిన ఆడియో, వీడియోలు బుధవారం పోలీస్‌శాఖను కలవరానికి గురిచేశాయి. ఇసుక, కిరోసిన్, రేషన్ బియ్యం వ్యాపారులనుంచి నెలవారీ మాముళ్లు వసూలు చేస్తున్నారని వీడియో ద్వారా బయటపెట్టాడు. ఈ అక్రమాలను అడ్డుకున్నాడనే నెపంతో కొద్ది రోజులుగా కానిస్టేబుల్ రాజుకుమార్‌ను డ్యూటీల విషయంలో వేధిస్తున్నారని పోలీస్ రికార్డులను చూపిస్తూ నిజాలను బయటపెట్టాడు. స్టేషన్లో పనిచేస్తున్న ఒక హోంగార్డును దఫేదార్‌గా నియమించుకున్న సీఐ.. అతని ద్వారా అవినీతి వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. దఫేదార్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నారనే సమాచారంతో ముందస్తుగా ఆ హోంగార్డు డ్యూటీని జనరల్ డ్యూటీగా మార్చారని రికార్డుల్లో మార్పుచేసిన విధానాన్నీ.. చూపించాడు. అతడి డ్యూటీని జనరల్ డ్యూటీగా మార్చడంతో ఎస్పీ కార్యాలయానికి అటాచ్ కాలేదని, తిరిగి పోలీస్‌స్టేషన్‌లోనే విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. అక్రమాలను అడ్డుకున్నందుకు తనపై కక్ష కట్టిన సీఐ డ్యూటీల విషయంలో తనను నిత్యం వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. స్టేషన్ వాచ్ డ్యూటీ చేసి దిగిన అనంతరం ఆ రోజు ఆబ్సెంట్ వేశారని రాకార్డుల్లో చూపించాడు. ఈ నెల 18న పాతబస్టాండ్ సమీపంలో కిరోసిన్ అక్రమంగా తరలిస్తున్న ఆటోను పట్టుకున్న కానిస్టేబుల్ రాజ్‌కుమార్ ఆ వివరాలను సైతం వీడియో తీశారు. ప్రతి నెలా రూ.2500 మాముళ్లు ఇస్తున్నామని ఈ మొత్తాన్ని ఐడీ పార్టీలో పనిచేసే రబ్బాని తీసుకెళ్తాడని ఆ వ్యాపారి చెప్పాడు. అతను డ్యూటీ విషయంలో ఎలా వేధిస్తున్నాడు. అక్రమ కిరోసిన్ దందా వద్ద నెలసరి మాముళ్లు ఎలా వస్తున్నాయో వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. రాత్రికి రాత్రే ఎస్పీ నుంచి పిలుపు.. సామాజిక మాధ్యమాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ అవినీతి బాగోతం వీడియో, ఆడియోలు పోలీస్‌శాఖ సామాజిక మాధ్యమ గ్రూప్‌లో సైతం హల్చల్ చేశాయి. దీంతో స్పందించిన జిల్లా పోçలీస్బాస్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్, కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌లకు తన కార్యాలయానికి రాత్రికి రాత్రే పిలిపించి వివరాలు సేకరించినట్లు విశ్వసనీ యంగా తెలిసింది.నెలవారీ మామూళ్లు ఇలా..పట్టణ శివారు ప్రాంతాలతో ముడిపడి ఉన్న టూటౌన్ పోలీన్ స్టేషన్ అధికారులకు నెలవారీ మామూళ్లకు కొదవలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో గుట్కా, ఖైనీ ఉత్పత్తుల తయారీ, అక్రమ రవాణ జరిపే వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అశోక్‌నగర్‌కు చెందిన ఒక గుట్కా వ్యాపారి నుంచి ప్రతినెలా మాముళ్లు అందుతున్నట్లు విమర్శలున్నాయి. నెలవారీ మామూళ్లను ముట్టజెప్పని సమయంలోనో, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు పెరిగిన రోజుల్లోనో నామమాత్రంగా దాడిచేసి గుట్కా వ్యాపారులను పట్టుకోవడం, కేసులు పెట్టడం.. ఆ తరువాత యథేచ్ఛగా దందా కొనసాగేట్లు సహకరించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు పోలీసులు ఎదుర్కొంటున్నారు. తడకమళ్ల, వేములపల్లి మండలాలనుంచి అనుమతుల పేరుతో రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణ జరిపే ట్రాక్టర్ల యజమానులతో సెటిల్మెంట్లు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఒప్పందం చేసుకున్న ట్రాక్టర్లను పట్టణంలోకి అనుమతిస్తూ రాత్రి 10గంటల వరకు అంటే ఇసుక అన్లోడ్ చేసే వరకు బీట్ డ్యూటీలు వేయకుండా సిబ్బందిని స్టేషన్‌కు పరిమితం చేసి వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో పీడీఎస్ బియ్యం, కిరోసిన్ అక్రమ రవాణాకు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పుడు బయటపడిన ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందోనని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద ట్రాక్టర్ మార్చిన..ఆడియో హల్చల్ పై విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది సేపటికే గత నెల ఏడుకోట్ల తండా వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదం కేసులో ప్రమాదం చేసిన ట్రాక్టర్ స్థానంలో మరో ట్రాక్టర్ మార్చి వారి వద్ద సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్ రూ.లక్ష తీసుకున్నట్లు సాక్షాలున్నాయి. దీనికి సంబంధించి టూటౌన్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వన్‌స్టార్ అధికారి కీలకపాత్ర పోషించి రూ.లక్ష వసూలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఆడియో కూ డా సోషల్‌మీడియాలో అప్లోడ్ అయింది. దీం తో సీఐ అవినీతి ఏ విధంగా సాగిందో వీడియో, ఆడియో టేపుల ద్వారా బయటికొచ్చింది. -
150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
మిర్యాలగూడ రూరల్: లారీలో అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మిర్యాలగూడ రూరల్ సీఐ రమేశ్‌బాబు, ఎస్ఐ కుంట శ్రీకాంత్ ఆదివారం పట్టణ పరిధిలో పట్టుకున్నారు. వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ శ్రీని వాస్ విలేకరులకు వెల్లడించారు. తుంగపహాడ్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో తెల్లవారుజామున 4:30 గంటలకు రూరల్ సీఐ, ఎస్ఐ నాగార్జునసాగర్ రోడ్డుపై తుంగపహాడ్ వద్ద కాపుకాచి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం లారీడ్రైవర్ చెన్నపల్లి వెంకన్నను విచారించగా బియ్యానికి సంబంధించిన వ్యక్తులు వివరాలు వెల్లడిం చినట్లు తెలిపారు. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన నిందితులు బి.అన్నారం గ్రామానికి చెందిన చేదెళ్ల రాజు, అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన బాల్స కృష్ణమూర్తి, దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన జానకి రెడ్డి, అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన డీలర్ గందె నాగేశ్వర్రావు, మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస్ (లారీ ఓనర్)లు గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి వాస శ్రీనివాస్‌కు అమ్మినట్టు వెల్లడించారు. నిందితుల్లో నలుగురు రాజు, వెంకన్న, కృష్ణమూర్తి, నాగేశ్వర్‌రావులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు వాస శ్రీనివాస్, జానకిరెడ్డిలు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. పట్టుబడిన లారీని సీజ్ చేశామని, పంచనామా నిర్వహించి నిబంధనల ప్రకారం నిందితులను, బియ్యాన్ని కోర్డుకు అప్పగించనున్నట్టు వివరించారు. పకడ్బందీగా ప్రజాభద్రత చట్టం అమలు అక్రమాలను అరికట్టేందుకు డీఐజీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ప్రజల భద్రతకు విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణంలో 150, లారీ అసోసియేషన్ వద్ద 20, శ్రీనివాస్‌నగర్‌లో 14, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30, వేములపల్లిలో 20, హాలియా, నాగార్జునసాగర్‌లో 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ ఎ.రమేష్ బాబు, ఎస్ఐ కుంట శ్రీకాంత్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గౌస్, రవి కుమార్, సాముల్ పాల్గొన్నారు. -
నయీం బావమరిదికి రెండు రోజుల కస్టడీ
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం బావమరిది ఫహీంను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఫహీంను విచారణ నిమిత్తం రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతడిని పోలీసులు మిర్యాలగూడకు తరలించారు. నయీం పేరుతో అతడు మిర్యాలగూడ ప్రాంతంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. -
నయీం బంధువులను విచారిస్తున్న పోలీసులు
నల్గొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నయీం బంధువులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 30 తులాల బంగారం, 70 తులాల వెండితోపాటు రూ. 1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న నయీం బంధువుల్లో నయిమ్ అత్తా, బావమరిదితోపాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు.