మిర్యాలగూడ అర్బన్ : పరువు హత్య కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని కూతురుని బెరించారనే అభియోగం మేరకు అమృత తండ్రి తిరునగరు మారుతీరావుతో పాటు మరో ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది తన కూతురు అమృతను వివాహం చేసుకున్నాడనే కక్షతో మారుతీరావు కిరాయి వ్యక్తులతో పెరుమాళ్ల ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడని అభియోగాలు ఉన్నాయి. ఆ కేసులో మారుతీరావుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్‌పై బయటికి వచ్చారు.
అయితే ఈ నెల 11వ తేదీన కందుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అమృత ఇంటికి వెళ్లి తనను మారుతీరావు పంపించాడని తెలిపాడు. ప్రణయ్ హత్య కేసులో సహకరించి మీ తండ్రి వద్దకు వస్తే ఆస్తిని మొత్తం నీ పేరుపై రాసి ఇస్తాడని చెప్పాడు. దీంతో అమృత వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం అందించింది. దీంతో స్పందించిన వన్‌టౌన్ పోలీసులు కందుల వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో మారుతీరావు, ఎంఎ కరీం లు తనను పంపారని అంగీకరించడంతో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. అమృత ఫిర్యాదు మేరకు ఈ ముగ్గరు వ్యక్తులపై బెదిరింపులు, సాక్షిని ప్రలోభపెట్టడం వంటి కేసులను నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు.
చదవండి:
అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి..
వ్యక్తి ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమా?
‘చనిపోయే వరకు అమృత ప్రణయ్లానే ఉంటాను’
ప్రణయ్ కేసులో నిందితులకు బెయిల్
వారి వల్లే ఇంకా బ్రతికున్నాం: ప్రణయ్ తండ్రి
Comments
Please login to add a commentAdd a comment