మిర్యాలగూడ టూటౌన్ సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్ అవినీతిపై అదే స్టేషన్ కానిస్టేబు ల్ రాజుకుమార్ తీసిన ఆడియో, వీడియోలు బుధవారం పోలీస్‌శాఖను కలవరానికి గురిచేశాయి. ఇసుక, కిరోసిన్, రేషన్ బియ్యం వ్యాపారులనుంచి నెలవారీ మాముళ్లు వసూలు చేస్తున్నారని వీడియో ద్వారా బయటపెట్టాడు. ఈ అక్రమాలను అడ్డుకున్నాడనే నెపంతో కొద్ది రోజులుగా కానిస్టేబుల్ రాజుకుమార్‌ను డ్యూటీల విషయంలో వేధిస్తున్నారని పోలీస్ రికార్డులను చూపిస్తూ నిజాలను బయటపెట్టాడు.
స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక హోంగార్డును దఫేదార్‌గా నియమించుకున్న సీఐ.. అతని ద్వారా అవినీతి వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. దఫేదార్‌లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నారనే సమాచారంతో ముందస్తుగా ఆ హోంగార్డు డ్యూటీని జనరల్ డ్యూటీగా మార్చారని రికార్డుల్లో మార్పుచేసిన విధానాన్నీ.. చూపించాడు. అతడి డ్యూటీని జనరల్ డ్యూటీగా మార్చడంతో ఎస్పీ కార్యాలయానికి అటాచ్ కాలేదని, తిరిగి పోలీస్‌స్టేషన్‌లోనే విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు.