పోలవరం భూ బాగోతంలో మరో అవినీతి బయపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలవరంలో తెలుగు తమ్ముళ్ల అవినీతిపై గత నాలుగైదు నెలలుగా సాక్షి టీవీలో వరుస కథనాలు ప్రచురితమవడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సాక్షి కథనాలతో విచారణ చేపట్టిన ఐటీడీఏ పీఓ హరీంద్రయ ప్రసాద్ దాదాపు రూ. 13 కోట్ల మేర అవినీతి జరిగినట్లు గుర్తించారు.