కిక్కిరిసిన మెట్రో.. ఏమైందో తెలియదు.. తన్నుకున్న యువకులు.. | Two Men Get Into A Fight In Delhi Metro Hurl Abuses At Each Other | Sakshi
Sakshi News home page

మెట్రోలో కాలుపెట్టే సందులేదు..లొల్లి షురూ..తన్నుకున్న యువకులు.. వీడియో వైరల్..

Published Wed, Jun 28 2023 9:01 PM | Last Updated on Wed, Jun 28 2023 9:19 PM

Two Men Get Into A Fight In Delhi Metro Hurl Abuses At Each Other - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. 

ఢిల్లీ మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. నిలబడటానికి కూడా సరిగా స్థలం దొరకని పరిస్థితి. ఇంతలోనే మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అదీ కాస్త ఘర్షణకు దారి తీసింది. కోపంతో ఇద్దరు యువకులు ఒకరిపై ఇంకొకరు రెచ్చిపోయారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. వారి గొడవ నుంచి మరికొందరు దూరంగా జరిగారు. దీంతో రైలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికులు మెట్రో యాజమాన్యాన్ని విమర్శించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు శూన్యమని కామెంట్లు పెట్టారు. ఘర్షణకు దిగిన ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మెట్రో కూడా స్పందించింది. నిందితులపై చర‍్యలు తీసుకుంటామని తెలిపింది. మెట్రోలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచనలు చేసింది.

ఇదీ చదవండి: వీడేం లవర్‌రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement