వింత వింత ఘటనలతో ఇటీవల ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రయాణికుల చేష్టలు, ప్రేమికుల రొమాన్స్, డ్యాన్స్ రీల్స్, మహిళ ఘర్షణలు వంటి వీడియోలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మెట్రో ట్రైన్‌లో అభ్యంతరకర, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే చేష్టలు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో ట్రెండింగ్‌గా మారింది.
మెట్రో రైలు కోచ్‌లో ఇద్దరు మహిళలు వాదులాడుకున్నారు. బ్లాక్, ఎల్లో డ్రెస్‌లు ధరించిన ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరినొకరు బట్టలు, జుట్టు లాగుతూ కొట్టుకున్నారు. వీరిలో బ్లాక్ డ్రెస్ ఆమె రెచ్చిపోయి ప్రవర్తించింది. అక్కడే ఉన్న ఓ మహిళ పోలీస్ అధికారి, చుట్టుపక్కల వారు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అంతేగాక ‘నేను జడ్జి కూతుర్ని, నిన్ను నేను వదిలిపెట్టను’ అంటూ పోలీస్‌ను హెచ్చరించింది సదరు మహిళ.
మరో మహిళ తాను ఏం తప్పు చేయలేదని ఎవరిపై శారీరకంగా దాడి చేయలేదని తెలిపింది. అయినా న్యాయమూర్తి కుమార్తెను అంటూ చెప్పుకుంటున్న మహిళ తగ్గకుండా తన హోదాను అడ్డుపెట్టుకొని వీరంగం సృష్టించింది. చివరికి స్టేషన్ రావడంతో ఇద్దరిని మెట్రో దిగి వెళ్లాలని పోలీస్ అధికారి సూచించడంతో వారు వెళ్లిపోయారు. ఈ వీడియోను ఘర్ కా కాలేష్ అనే ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
చదవండి: పెళ్లిలో యువతుల జోరు.. బ్లాక్ డ్రెస్‌లో కుమ్మేశారు..!
అయితే అసలు వాళ్ల సమస్య ఏంటి? గొడవెందుకు? అనేది తెలియలేదు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఏంటీ బ్రో.. ఈ ఆడవాళ్లు మరీ ఇలా తయారయ్యారు. వీళ్లకు ఎక్కడ చూసిన గొడవలేనా. అయినా ఇవన్నీ ఢిల్లీ మెట్రోలో సాధారణమే. నల్ల రంగు దుస్తులు ధరించిన మహిళ తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది. మహిళా పోలీస్ అధికారికి సెల్యూ చేద్దాం’అని రకరకాలుగా కామెంట్ ఇచ్చారు.
.
Kalesh inside delhi metro b/w Two woman, a lady cop interfere 🫡 pic.twitter.com/zlQ7gUyZ2F
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 2, 2023
Comments
Please login to add a commentAdd a comment