ఇద్దరు మహిళలు గొడవ పడటానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న విషయాలతో మొదలైన వాటిని కూడా ఎంత దూరమైనా తీసుకువెళ్లగలరు. కుళాయి వద్ద, మెట్రో, రైలు, బస్సు వంటి చోట్ల సీట్ల విషయంలో ఆడవాళ్లు గొడవ పడటం సాధారణంగా చూస్తూనే ఉంటాం.. కానీ ఓ పాఠశాలలో ముగ్గురు మహిళా టీచర్లు ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు. ఒకరినొకరు జుట్టు పట్టుకొని, చెప్పులతో వాయించుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిహార్‌లోని పాట్నా జిల్లాల్లో ఈ ఉదంతం వెలుగు చూసింది. బిహ్తాలోని పాఠశాలలోని క్లాస్‌రూమ్‌లోని ఏదో విషయంలో మహిళా ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఒకరిని మరొకొరు కొట్టుకునేదాకా వెళ్లింది. ప్రధానోపాధ్యాయురాలిని కాంతి కుమారిగా గుర్తించగా.. మరో టీచర్ పేరు అనితా కుమారి. వీరిద్దరికి ముందుగా తరగది గది లోపల గొడవ ప్రారంభమైంది. ఈ ఘర్షణలో మరో ఉపాధ్యాయురాలు కూడా చేరింది.
చదవండి: రేపు సీఎం కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ.. విషయమిదే..
ఇద్దరు టీచర్లు కలిసి క్లాస్ రూమ్‌లో విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తరువాత బయటకు వచ్చి చేతిలో చెప్పులు పట్టుకుని ప్రిన్సిపాల్ వెంట పరుగెత్తీ మరి దాడి చేశారు. ముగ్గురూ పక్కనే ఉన్న పోలాల్లో పడిపోయినా.. గొడవ ఆపకుండా కొట్టుకున్నారు. కర్రలు, చెప్పులతో ఒకరినొకరు తన్నుకున్నారు. ఈ గొడవను ఆపేందుకు పలువురు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీనిని క్లాస్ రూమ్‌లోని విద్యార్థులు ఫోన్‌లో రికార్డ్ చేశారు.
దీనికి పాఠశాల అధికారి నవేష్ కుమార్ స్పందించారు. ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ మధ్య వ్యక్తిగత వివాదం కారణంగా గొడవకు దారితీసిందని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలిందన్నారు. ఘర్షణలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులను వివరణ కోరినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని.. తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
చదవండి: ఆరుసార్లు అమ్మాయి.. మళ్లీ అదే పరిస్థితి.. కన్నీరు పెట్టిస్తున్న ‘అమ్మ’ ఉత్తరం
Comments
Please login to add a commentAdd a comment