గ్రేటర్ నోయిడాలో గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రికత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుకుని సుమారు 33 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసలు తెలిపిన కథనం మేరకు.. సెక్యూరిటీ గార్డులు యూనివర్సిటీ క్యాంపస్‌లోని మున్షీ ప్రేమ్‌చంద్ హాస్టల్‌లో కొందరు విద్యార్థులు సిగరెట్ తాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది.
అదికాస్త తీవ్రమై ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుడంతో తాము ఘటన స్థలానికి చేరుకుని ఆయా వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో ప్రైవేటు గార్డులు, కళాశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులను స్వీకరించామని, దీనిపై సత్వరమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, క్యాంపస్ వెలుపల సెక్యూరిటీ గార్డు, విద్యార్థులు కర్రలు చేతపట్టుకుని ఘర్షణ పడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(చదవండి: రైలు ప్రమాదం మరణాలపై సర్వత్రా ఆరోపణలు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఒడిశా ప్రధాన కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment