
సాక్షి, ఖమ్మం: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల స్టూడెంట్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్, జూనియర్ విద్యార్థులు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. కాలేజీ నుంచి విద్యార్థులు బయటకు వస్తున్న సమయంలో గొడవ జరిగింది. జూనియర్లు కాపుకాసి సీనియర్ విద్యార్థిని చితకబాదారు. జూనియర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో సీనియర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో యువకుడిని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఓ విషయంలో తెలెత్తిన వివాదం కారణంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. గాయపడిన విద్యార్థి ఓ కార్పొరేటర్ కొడుకుగా తెలుస్తుంది. పట్టపగలే విద్యార్థులు కర్రలతో దాడి చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. కాగా విద్యార్థులు కొట్టుకున్న దృశ్యాలు కళాశాల గేట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
చదవండి: సంగారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం.. చిరుత చిక్కిందిలా!
Comments
Please login to add a commentAdd a comment