కొండంతా జనం
కొండంతా జనం
Published Mon, Aug 15 2016 7:50 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
మల్లాపూర్: మండల కేంద్రంలోని సోమేశ్వర కొండ భక్తజన సంద్రమైంది. శ్రావణ సోమవారం కావడంతో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలనుంచి వేలాదిమంది తరలివచ్చారు. మొదటగా కోనేరులో పుణ్యస్నానం ఆచరించి మడి బట్టలతోనే శ్రీకనకసోమేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన వరద పాశంను వండి నైవేద్యంగా సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. సర్పంచ్ గోపిడి రాజరెడ్డి, ఎంపీటీసీలు మొరపు గంగరాజం, డబ్బా రాజురాజరెడ్డి, గ్రామాభివద్ధి కమిటీ అధ్యక్షుడు ముద్దం సత్యనారాయణగౌడ్ స్వామి వారికి వరద పాశం సమర్పించారు. బీజేపీ శాసనసభపక్ష మాజీనాయకుడు యెండల లక్ష్మీనారాయణ సోమేశ్వర కొండపైకి వచ్చి శ్రీ కనకసోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు బల్యపెల్లి ప్రభాకర్‌శర్మ, కష్ణప్రసాద్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.
Advertisement
Advertisement