తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుదుకొట్టై సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో పదిమంది అయ్యప్ప స్వామి భక్తులు దుర్మరణం పాలైయ్యారు. మరో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భక్తులతో వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 16మంది భక్తులు ఉన్నట్లు సమాచారం.