శ్రీవారి ఆలయం వద్ద భక్తుల సందడి
సాక్షి, తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 42,934 మంది శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 15 కంపార్ట్‌మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 8 కంపార్ట్‌మెంట్లలోని కాలిబాట భక్తులకు 6 గంటలు సమయం తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. శ్రీవారి హుండీ కానుకలు రూ.3.14 కోట్లు లభించాయి.
శ్రీవారి ట్రస్టులకు రూ.18 లక్షల విరాళం
తిరుమల శ్రీవారి ట్రస్టులకు శుక్రవారం రూ.18 లక్షలు విరాళంగా అందింది. ఇందులో నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 లక్షలు, వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.5 లక్షలు, ప్రాణదాన ట్రస్టుకు రూ.లక్ష, సిమ్స్ ట్రస్టుకు రూ.10 లక్షలు ఇచ్చారు. భక్తులు డీడీలు స్థానిక దాతల విభాగంలో అధికారులకు అందజేశారు.