( ఫైల్ ఫోటో )
సాక్షి, ఢిల్లీ: అమర్ నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్రకు కేంద్రం ఏర్పాటు చేసింది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ ఆలయం ఉంది.
అమర్‌నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్, గండర్బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో 2023 అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుంది.
ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే.. అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలు, భద్రతను సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment