
వర్ష బీభత్సం, 16 మంది భక్తుల దుర్మరణాలతో ఈ నెల 8 నుంచి తాత్కాలికంగా ఆగిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం తిరిగి మొదలైంది. 12వ బ్యాచ్ కింద 4,236 మంది యాత్రికులు దర్శనానికి బయల్దేరారు. వీరంతా మంగళవారం ఉదయానికల్లా గుహకు చేరతారని అధికారులు వెల్లడించారు. గుహకు చేరే మార్గం వరదల్లో దెబ్బతినడంతో సైన్యం తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని సిద్ధం చేసింది. ఇప్పటిదాకా 1.13 లక్షల మంది శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆగస్టు 11న యాత్ర ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment