
సెక్యూరిటీ అలర్ట్‌పై మెహబూబ్ ముఫ్తీ ఫైర్
శ్రీనగర్ : అమర్‌నాథ్ యాత్రికులు, టూరిస్టులకు ఉగ్ర ముప్పుపై భద్రతా పరమైన సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ స్పందించారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కశ్మీర్‌ను వాడుకోరనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్థిక వ్యవస్థ పతనావస్ధలో ఉందని, ప్రజలను వాస్తవిక అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీసి కశ్మీరీలను సంక్షోభ అంచులకు చేర్చుతాయని మెహబూబా ట్వీట్ చేశారు.
కాగా, అమర్‌నాథ్ యాత్ర రూట్‌లో మందుపాతరలు, స్నిపర్ తుపాకులు లభించడంతో యాత్రికులకు, సందర్శకులకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పలు సూచనలతో మార్గదర్శకాలను జారీ చేసింది.