
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్‌బల్ జిల్లాలో ఆదివారం(ఆగస్టు4) కుండపోత(క్లౌడ్‌బర్స్ట్) వర్షం కురిసింది. దీంతో శ్రీనగర్-లేహ్ జాతీయరహదారికి దారి తీసే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
శ్రీనగర్- లేహ్ జాతీయరహదారిపైనా ట్రాఫిక్‌ను రద్దు చేయడంతో బల్టాల్ వద్ద అమర్‌నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన ఆకస్మిక వరదల కారణంగా పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment