mehabooba mufthi
-
Article 370: సుప్రీం కోర్టు తీర్పుపై నిరుత్సాహ పడం: మెహబూబా ముఫ్తీ
సాక్షి, ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ, ఆ పార్టీ నేతలు స్వాగతించగా కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు, పలువురు నేతలు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. సుప్రీం కొర్టు తీర్పుకు నిరుత్సాహ పడటం లేదు. ఈ విషయంలో జమ్ము కశ్మీర్ ఎన్నో ఒడిదుడుకులు చూసింది. 370 నిబంధన తాత్కాలికమన్న వ్యాఖ్యలతో తాము ఓడిపోనట్లు కాదు. ఇది భారత దేశ ఆలోచనల ఓటమి. #WATCH | On SC verdict on Art 370 in J&K, PDP chief Mehbooba Mufti says, "...We should not be disheartened... J&K has seen several ups and downs... SC's verdict stating Article 370 was a temporary provision, is not our defeat, but the defeat of the idea of India... I want to say… pic.twitter.com/moTm2HPzpO — ANI (@ANI) December 11, 2023 ప్రస్తుతం జమ్ము కశ్మీర్ జైలులా మారింది. దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరవద్దని ఆదేశించారు. మేము అంతా గృహ నిర్భందంలో ఉన్నాం. ఏళ్ల నుంచి కొనసాగుతున్న రాజకీయం యుద్ధం ఇది. మేము ఇక్కడి నుంచి వెళ్లము. మీమంతా ఏకమై.. కలిసిపోరాడుతాం’అని తెలిపారు. డొమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... సుప్రీకోర్టు తీర్పు చాలా విచారకరం, దురదృష్టకరమైందని తెలిపారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. On SC verdict on Article 370, National Conference leader Omar Abdullah says, "We had knocked on the doors of the Supreme Court because we were hoping for justice...We respect the Supreme Court...Our attempts will not end here. Will we approach the courts again? We will decide… pic.twitter.com/eWWbPhY9Pp — ANI (@ANI) December 11, 2023 అదే విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘న్యాయం కోసం ఆశించి సుప్రీంకోర్టు ఆశ్రయించాం. మాకు న్యాయం దక్కుతుందని ఆశించాం. అయితే సుప్రీం కోర్టుపై మాకు గౌరవం ఉంది. మా ప్రయత్నాలు ఇక్కడితో ఆగిపోతాయా? మళ్లీ కోర్టులను ఆశ్రయిస్తామా? అనే దానిపై న్యాయ సంప్రదింపుల అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. -
భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం
అవంతిపురా/శ్రీనగర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం పునఃప్రారంభమైంది. రాహుల్ గాంధీ ఉదయం 9.20 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. భద్రతాపరమైన లోపాలున్నాయంటూ శుక్రవారం మధ్యాహ్నం యాత్రను నిలిపేయడం తెలిసిందే. దాంతో శనివారం మూడంచెల భద్రత కల్పించారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో ఉగ్రవాద దాడిలో మరణించిన 40 సీఆర్పీఎఫ్ జవాన్లకు రాహుల్ గాంధీ శనివారం నివాళులర్పించారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో బస్సు ధ్వంసమైన చోట పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. యాత్రలో ప్రియాంకా గాంధీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకాగాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. శనివారం లెథ్‌పురాలో సోదరుడు రాహుల్ గాంధీపాటు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని చుర్సూలో పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ, ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ సైతం రాహుల్ గాంధీతోపాటు జోడో యాత్రలో పాల్గొన్నారు. తాజా గాలి పీల్చుకున్నట్లే ఉంది: ముఫ్తీ కశ్మీర్లో జోడో యాత్ర జరగడం తాజా గాలి పీల్చుకున్నట్లుగా ఉందని మెహబూబా ముఫ్తీ శనివారం ట్వీట్ చేశారు. 2019 తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చారని చెప్పారు. యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడవడం గొప్ప అనుభవమని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం జోడో యాత్ర ఆదివారం ఉదయం పంథాచౌక్ నుంచి పునఃప్రారంభం కానుంది. శ్రీనగర్‌లో బోలివార్డ్ రోడ్డులోని నెహ్రూ పార్కు వరకూ యాత్ర సాగుతుంది. సోమవారం శ్రీనగర్ ఎంఏ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జెండా ఎగురవేస్తారు. అనంతరం ఎస్కే స్టేడియంలో విపక్ష పార్టీల నేతలతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అమిత్ షాకు మల్లికార్జున ఖర్గే లేఖ జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న భారత్‌జోడో యాత్రకు తగిన భద్రత కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. యాత్రలో భద్రతాపరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ కిశోర్ సమావేశం
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో 5 గంటలపాటు సమావేశమయ్యారు. ప్రియాంకా గాంధీ, అంబికా సోనీ, పి.చిదంబరం, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలతో పీకే భేటీ కావడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. ఈ ఏడాడి ఆఖర్లో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. పీకే త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారంటున్నారు. ఆయన శనివారం సోనియా గాంధీ సమక్షంలో పూర్తిస్థాయి ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 370 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. సోనియాతో మెహబూబా ముఫ్తీ భేటీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సోమవారం సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. దేశం ఇప్పటిదాకా భద్రంగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనతేనని మెహబూబా ముఫ్తీ కితాబిచ్చారు. మరిన్ని పాకిస్తాన్లను సృష్టించాలని అధికార బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. -
టార్గెట్ అమర్నాథ్పై స్పందించిన ముఫ్తీ
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రికులు, టూరిస్టులకు ఉగ్ర ముప్పుపై భద్రతా పరమైన సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ స్పందించారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కశ్మీర్‌ను వాడుకోరనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పతనావస్ధలో ఉందని, ప్రజలను వాస్తవిక అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీసి కశ్మీరీలను సంక్షోభ అంచులకు చేర్చుతాయని మెహబూబా ట్వీట్ చేశారు. కాగా, అమర్నాథ్ యాత్ర రూట్లో మందుపాతరలు, స్నిపర్ తుపాకులు లభించడంతో యాత్రికులకు, సందర్శకులకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పలు సూచనలతో మార్గదర్శకాలను జారీ చేసింది. -
‘ఈవీఎంలపై ఈసీ మౌనం’
సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంల అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నా ఈసీ మౌనంగా వ్యవహరించడం ఆవేదన కలిగిస్తోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈవీఎంలపై పలు సందేహాలు వెల్లడవుతున్నా ఈసీ వివరణ ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను వ్యూహాత్మకంగా వెల్లడించడం చూస్తుంటే మరో బాలాకోట్ తతంగాన్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తోందని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా సార్వత్రిక సమరంలో బీజేపీ గెలుపొంది మళ్లీ అధికారంలోకి వచ్చినా మంచి కోసం ప్రజలు జరిపే పోరాటం ఆగరాదని అన్నారు. బీజేపీ గెలుపు ఓటములతో ప్రపంచంఆగిపోదని, వ్యవస్ధలను నిర్వీర్యం చేయడం, సమగ్రతను దెబ్బతీయడం వంటి విపరిణామాలకు వ్యతిరేకంగా సమాజం, జర్నలిస్టులు నిబద్ధతతోనిలబడి పోరాటం కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు. -
‘వాళ్లని రాళ్లతో కొట్టిచంపాలి’
శ్రీనగర్ : బండిపార జిల్లాలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఉదంతంలో షరియా చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కోరారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఓ ట్వీట్లో పేర్కొన్నారు. సంబల్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వినడానికే తనకు సిగ్గుగా ఉందని, లైంగిక దాడి ఘటనలపై కొందరు మహిళలే నిందితులను ప్రేరేపించేలా వ్యవహరిస్తారని సమాజం తరచూ నిందిస్తుందని మరి ఈ చిన్నారి ఏం తప్పు చేసిందని మెహబూబా ముప్తీ ప్రశ్నించారు. ఇలాంటి వారిని షరియా చట్టం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని కోరారు. బండిపార జిల్లా సంబల్ ప్రాంతంలో మే 9న మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం జమ్ము కశ్మీర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. చిన్నారిపై లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. -
వెంకయ్యతో ముఫ్తీ భేటీ
న్యూఢిల్లీ : ఎన్.ఐ.టి (నిట్) విద్యార్థుల సమస్యలు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం వెంకయ్యనాయుడు,ముఫ్తీ విలేకర్లతో మాట్లాడుతూ... ఇరువురి మధ్య శ్రీనగర్ ఎన్ఐటీ అంశం చర్చకు వచ్చినట్లు ఆయన తెలిపారు. హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఆ తర్వాత ఎన్ఐటీలో చోటు చేసుకున్న ఘటనలు... పరిణామాలతోపాటు ఆయా సమస్యల పరిష్కారంపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ నేపథ్యం ప్రతిఒక్కరు గుర్తించుకోవాలన్నారు. అయితే ఈ సమస్యలను రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని వెల్లడించారు. రాజకీయాలు చేయవద్దని ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు వెంకయ్య హితవు పలికారు. మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. స్థానికేతర విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. వెంటనే తిరిగి రావాలని క్యాంపస్ నుంచి వెళ్లిన విద్యార్థులకు ఆమె సూచించారు.