శ్రీనగర్ : బండిపార జిల్లాలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఉదంతంలో షరియా చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కోరారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. సంబల్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వినడానికే తనకు సిగ్గుగా ఉందని, లైంగిక దాడి ఘటనలపై కొందరు మహిళలే నిందితులను ప్రేరేపించేలా వ్యవహరిస్తారని సమాజం తరచూ నిందిస్తుందని మరి ఈ చిన్నారి ఏం తప్పు చేసిందని మెహబూబా ముప్తీ ప్రశ్నించారు.
ఇలాంటి వారిని షరియా చట్టం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని కోరారు. బండిపార జిల్లా సంబల్ ప్రాంతంలో మే 9న మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం జమ్ము కశ్మీర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. చిన్నారిపై లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment