జమ్ము కశ్మీర్: అమర్‌నాథ్ యాత్ర భక్తులతో ఉన్న బస్సుకు బ్రేక్స్ ఫెయిల్ కావటంతో భయానక ఘటన చోటు చోటుకుంది. ఈ ఘటన మంగళవారం జమ్ము కశ్మీర్‌లోని రామ్‌బణ్ జిల్లాలోని నేషనల్ హైవే 44పై జరిగింది. యాత్రికులతో బస్సు అమర్‌నాథ్ నుంచి పంజాబ్‌లోని హొసియాపూర్‌కు వెళ్తుండుగా బ్రేక్స్ ఫెయిల్ అయినట్లు డ్రైవర్ తెలిపాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కొందరు యాత్రికులు కదులుతున్న బస్సు నుంచి బయటకు దూకారు. అలా బయటకు దూకిన 10 మంది గాయపడ్డారు.
The brakes of a bus carrying Amarnath pilgrims failed on a slope while returning from Baltal to Hoshiarpur. Some people jumped out of the moving bus. Police and security forces stopped the bus with great effort. 8 people were injured in the incident. The pilgrims were from… pic.twitter.com/Y6mnmHQpPG
— Gagandeep Singh (@Gagan4344) July 2, 2024
ఈ విషయాన్ని తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి బస్సు లోయలో పడిపోకుండా బండరాళ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరు మృతి చెందలేదని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై భద్రత అధికారులు స్పందించారు. ‘బస్సులో 40 అమర్‌నాథ్ యాత్రికులు ఉన్నారు. బాస్సు అమర్‌నాథ్ నుంచి పంజాబ్‌లోని హొసియాపూర్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బ్రేక్స్ ఫెయిల్ కావటంతో డ్రైవర్ బస్సు ఆపడానికి సాధ్యం కాలేదు. విషయంలో తెలియగానే భద్రతా బలగాలు.. బస్సు ముందు బండరాళ్లను పెట్టి ఆపారు’ అని పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment