
న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ యంత్రాంగం సోమవారం ప్రకటించింది. కరోనా కారణంగా అమర్‌నాథ్ యాత్ర రద్దు కావడం ఇది రెండోసారి. కరోనా విజృంభిస్తోన్న సమయంలో అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. యాత్రికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలిపింది. వర్చ్యువల్‌లో పూజా కార్యక్రమాలను చూడొచ్చని అమర్‌నాథ్ బోర్డు తెలిపింది. 56 రోజులపాటు జరిగే అమర్‌నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమై ఆగష్టు 22న ముగుస్తుంది.
Shri Amarnathji Yatra cancelled in wake of Covid-19 Pandemic. Decision after threadbare discussion with Shri Amarnathji Shrine Board members. Yatra to be symbolic only. However, all the traditional religious rituals shall be performed at the Holy Cave Shrine as per past practice.
— Office of LG J&K (@OfficeOfLGJandK) June 21, 2021
Comments
Please login to add a commentAdd a comment