అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికి 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడమే కారణమని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. దీనిని తొలగించకముందు మధ్యప్రదేశ్ నుంచి ఏటా అరమ్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య 26 నుంచి 30 వేలు కాగా, దీనిని తొలగించిన తర్వాత యాత్రికుల సంఖ్య 40 వేలకు చేరుకుంది.
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుండి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 19 న రక్షాబంధన్ వరకు కొనసాగనుంది. అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భక్తుల ప్రయాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ తేదీని ప్రకటించిన వెంటనే ప్రయాణికులు రైలు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించనున్నారు. అయితే కొందరు ప్రయాణ తేదీలను అంచనా వేస్తూ రిజర్వేషన్లు చేయించుకుటున్నారని సమాచారం.
ఈసారి మధ్యప్రదేశ్ నుంచి అమర్‌నాథ్ వెళ్లే యాత్రికుల సంఖ్య 45 వేలు దాటుతుందని ఓం శివసేవా శక్తి మండల్ సంస్థ అంచనా వేసింది. ఎంపీ నుంచి 2018లో 35 వేల మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. 2019లో 30 వేల మంది అమర్‌నాథ్ యాత్ర చేశారు. అయితే 2020, 2021లలో కరోనా కారణంగా అమర్‌నాథ్ యాత్ర జరగలేదు. 2022లో 35 వేల మంది, 2023లో 40 వేల మంది అమర్‌నాథ్‌ను దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment