అమర్నాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి.
జమ్ము: అమర్నాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ లో అశాంతికర పరిస్థితుల నేపథ్యంలో మరోసారి యాత్రికులను అధికారులు అడుగు కూడా వేయనివ్వడం లేదు.
మరోపక్క 6,679మంది యాత్రికులు ఇప్పటికే దర్శనం ముగించుకొని అక్కడి నుంచి ఇటు వచ్చే పరిస్థితి లేకుండా అయింది. అలాగే, ప్రస్తుతం భగవతి నగర్ యాత్రి నివాస్లో 1,700మంది ఎదురుచూస్తున్నారు. దీనిపై ఓ సీనియర్ అధికారి వివరణ ఇచ్చాడు. ఈరోజు లోయలో పరిస్థితులు గమనించిన తర్వాతే మరోసారి చర్చించుకొని యాత్రికులను అనుమతించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.