
అమర్‌నాథ్ యాత్రికుల రక్షణకు చర్యలు
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి జమ్మూ కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 44 మంది యాత్రికులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
యాత్రలో చిక్కుకున్న వారు సురక్షితంగా స్వగ్రామాలకు చేరుకొనేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఆదేశించారు. వీరందరినీ నేరుగా జమ్మూకశ్మీర్ లేదా ఢిల్లీ నుంచి స్వస్థలాలకు చేర్చాలని అధికారులకు తెలిపారు.