అమర్‌నాథ్‌లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు జమ్ముకశ్మీర్‌కు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శనివారం అమరనాథుణ్ణి 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 2,93,929 మంది భక్తులు అమర్‌నాథ్‌కు తరలివచ్చారు.
అమరనాథుణ్ణి త్వరగా దర్శించుకోవాలనే ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తోంది. ఇందుకోసం టోకెన్లు పొందేందుకు, భక్తులు తెల్లవారుజాము నుంచే సేవా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తాజాగా 1,630 మంది భక్తులు 74 చిన్న, పెద్ద వాహనాల్లో జమ్ము నుంచి బల్తాల్‌కు బయలుదేరారు. వీరిలో 1068 మంది పురుషులు, 546 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా పహల్గాం మార్గంలో 109 చిన్న, పెద్ద వాహనాల్లో 3039 మంది భక్తులు కశ్మీర్‌కు తరలి వెళ్లారు. వీరిలో 2350 మంది పురుషులు, 584 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు, 96 మంది సాధువులు, ఇద్దరు సాధ్వులు ఉన్నారు. కాగా ఆగస్టు 19న అమర్‌నాథ్ యాత్ర ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment