
సాక్షి, వైఎస్సార్ : అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహిళా భక్తురాలు భాగ్యమ్మ బల్తాల్ బేస్ క్యాంపులో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. భాగ్యమ్మ మృతదేహాన్ని రేపు విమానంలో స్వస్థలానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అమర్‌నాథ్ యాత్రలో బుధవారం 15 మంది భక్తులు ఆక్సిజన్ అందక ఇబ్బందికి గురయ్యారు. అయితే తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారికి ఆక్సిజన్ మాస్క్‌లు అందజేసి, మెడికల్ క్యాంపులకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment