
జమ్మూ: దాదాపు రెండు నెలల పాటు సాగే పవిత్ర అమర్‌నాథ్ యాత్ర జూన్ 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆశ్రమ బోర్డు వెల్లడించింది. ఈ యాత్ర గత ఏడాది కంటే ఈసారి 20 రోజులు ఎక్కువగా సాగుతుందని పేర్కొంది. హిందూ క్యాలండర్ ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ రోజు ప్రారంభమై శ్రావణ పూర్ణిమ(రక్షాబంధన్) రోజు ముగుస్తుందని శ్రీ అమర్‌నాథ్‌జీ ఆశ్రమ బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) వివరించింది. అమర్‌నాథ్ ప్రవేశ ప్రదేశం నుంచి లోపలికి వెళ్లే మార్గాన్ని ఎన్జీటీ గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన నిశ్శబ్ద జోన్‌గా ప్రకటించింది.
అయితే, దీనిపై ఎస్‌ఏఎస్‌బీ కోర్టును ఆశ్రయించగా ఎన్జీటీ వివరణ ఇచ్చింది. అమర్‌నాథ్ గుహ లోపల భక్తులు భజనలు చేసుకునేందుకు మంత్రాలు జపించుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గురువారం జమ్మూకశ్మీర్ గవర్నర్, ఎస్‌ఏఎస్‌బీ చైర్మన్ ఎన్‌ఎన్ వోహ్రా అధ్యక్షతన భేటీ అయిన బోర్డు యాత్రపై నిర్ణయం తీసుకుంది. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుందని, అమర్‌నాథ్ గుహకు వెళ్లే రెండు మార్గాల్లోనూ రోజుకు 7,500 యాత్రికుల చొప్పున అనుమతించనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment