శ్రీనగర్: ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర ముగిసింది. 2.85 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇది గతేడాది కన్నా 25 వేలు ఎక్కువ. జూన్ 28న ఈ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది యాత్రలో వాతావరణ, అనారోగ్య కారణాలతో మొత్తం 38 మంది మరణించారని అధికారులు తెలిపారు. గత సంవత్సరం యాత్రీకుల బస్సుపై మిలిటెంట్లు చేసిన దాడిలో 8 మంది చనిపోయిన నేపథ్యంలో ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment